బాలీవుడ్‌లో వంద కోట్ల కథానాయికలకు కొదవ లేదు. దాదాపుగా ప్రతి స్టార్ హీరోయిన్ ఏదో ఒక సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టే ఉంటుంది. ఐతే ముందుగా ఈ విషయంలో హవా సాగించింది కరీనా కపూర్. ప్రస్తుత హీరోయిన్లలో అందరికంటే ముందు వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది ఆమే. ఆ తర్వాత దీపిక హవా సాగింది. ఓ దశలో దీపిక నటించిన ప్రతి సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయేది. అందుకే ఆమెనందరూ గోల్డెన్ గర్ల్ అనేవాళ్లు. ఐతే ఈ మధ్య దీపిక జోరు కొంచెం తగ్గింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వంద కోట్ల హీరోయిన్‌గా శ్రద్దా దాస్ పేరు వినిపిస్తోంది.
శ్రద్ధా తొలి సినిమా 'ఆషికి 2' వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఐతే ఇదేమీ మాస్ సినిమా కాదు. ఇందులో స్టార్లు లేరు. ఓ మామూలు లవ్‌స్టోరీనే అయినా.. వంద కోట్ల వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రద్ధా రెండో సినిమా 'ఏక్ విలన్' కూడా వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు శ్రద్ధా కొత్త సినిమా 'ఏబీసీడీ2' కూడా ఈ క్లబ్‌లో అడుగుపెట్టేసింది. ఈ సినిమాకు రివ్యూస్ అంత గొప్పగా ఏమీ రాలేదు. ఇదేదో డ్యాన్స్ వీడియోల్ని కలిపి చేసిన సినిమాలా ఉందని విమర్శకులు పెదవి విరిచారు. అయినప్పటికీ వంద కోట్ల వసూళ్లు రాబట్టిందీ సినిమా. చేసినవన్నీ చిన్న సినిమాలే అయినా.. మూడుసార్లు వంద కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయిక అయింది శ్రద్ధా. ఆమె జోరు ఇలాగే సాగితే.. వంద కోట్ల క్లబ్ విషయంలో దీపిక రికార్డు బద్దలయ్యేలా ఉంది.