శ్రద్ధ చేయాలంటే అంత ఇచ్చుకోవాలా?

Update: 2015-12-10 18:26 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయబోతున్న మూవీ అధికారికంగానే ప్రారంభమైపోయింది. ప్రస్తుతం చేస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రాన్ని కంప్లీట్ అయిపోగానే.. దీన్ని స్టార్ట్ చేసేస్తాడు జూనియర్. ఈ మూవీలో ఎన్టీఆర్ జంటగా బాలీవుడ్ భామను తెచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు యూనిట్.

ఇప్పటికే పరిణీతి చోప్రాను అడిగారనే ఓ టాక్ ఉంది. మరోవైపు అమైరా దస్తూర్, సమంతలను కూడా అప్రోచ్ అయ్యారనే వార్తలొస్తున్నా.. ఇంకా ఎవరినీ కన్ఫాం చేయలేదు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని హీరోయిన్ రోల్ చేయాల్సిందిగా అడిగినట్లు టాక్‌. అయితే.. ఇలా తన దగ్గరకు ఆఫర్ తో వచ్చిన వారిని.. ఆ భామ బాగా షాక్ ఇచ్చిందట. ఎన్టీఆర్ మూవీలో చేసేందుకు ఏకంగా ₹ 3.5 కోట్లు అడగడంతో మైత్రి మూవీస్ టీం నోరెళ్లబెట్టారట.

ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కు కూడా చెల్లించని మొత్తం ఇది. ఇప్పటికైతే సౌత్ లో నయనతార ఒక్కతే రెండున్నర, మూడు కోట్ల మధ్య డిమాండ్ చేస్తోంది. అది కూడా లేటెస్ట్ గా వచ్చిన మూడు బ్లాక్ బస్టర్స్ తర్వాతే. మరి ఈ సుందరాంగి ఏకంగా మొదటి సినిమాకే మూడున్నర కోట్లు అనడంతో.. సైలెంట్ అయ్యారని టాక్.
Tags:    

Similar News