లాయ‌ర్ కాబోయి హీరోయిన్ అయ్యిందే!

Update: 2019-04-14 14:21 GMT
డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌ వాళ్లు ఎంద‌రో. కానీ ఈవిడ లాయ‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యిందిట‌. జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న డెబ్యూ నాయిక శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ గురించే ఇదంతా. అన్నీ కుదిరితే ఆవిడ లాయ‌ర్ కావాల్సింది. కానీ క‌థానాయిక అయ్యింది. ప్ర‌స్తుతం ఒకేసారి మూడు తెలుగు సినిమాల్లో న‌టిస్తోంది ఈ భామ‌. తొలిగా వీటిలో జెర్సీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భ ంగా ప్ర‌చార కార్య‌క్రమాల్లో శ్ర‌ద్ధా ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది. ఒక క్రికెట‌ర్ క‌థ‌తో తెర‌కెక్కినా ఈ సినిమాలో అంత‌కుమించిన లైఫ్ ని - ఎమోష‌న్ ని తెర‌పై ఆవిష్క‌రించార‌ని.. యంగ్ గాళ్ గా.. భార్య‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కింద‌ని చెప్పారు శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్‌. నేచురల్ స్టార్ నాని - శ్రద్ధ శ్రీనాథ్ జంట‌గా మళ్ళీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా శ్ర‌ద్ధా హైద‌రాబాద్ లోని సంస్థ కార్యాల‌యంలో ముచ్చ‌టించింది.

తెలుగ‌మ్మాయిలా తెలుగు బాగానే మాట్లాడేస్తున్నారు! అన్న ప్ర‌శ్న‌కు.. నాకు తెలుగు బాగానే అర్థ‌మ‌వుతుంది. సికిందరాబాద్ లో ఆరేళ్లు నివాసం ఉన్నాం. స్కూలింగ్ అక్కడే జరిగింది. నాన్న‌గారు ఆర్మీలో పని చేస్తారు. ఆయన ఉద్యోగ రీత్యా నా బాల్యంలో ఆరేళ్లు సికిందరాబాద్ తో ముడిపడి ఉంది. స్వ‌స్థ‌లం బెంగుళూరు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నాం అని తెలిపింది. జెర్సీ కాకుండా వేరే సినిమాలేవైనా చేశారా? జెర్సీ కంటే ముందు కొన్నిటికి సంత‌కం చేశాను. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ క్ష‌ణం ర‌వికాంత్ ద‌ర్శ‌కత్వం లో తెర‌కెక్కుతోంది. ఆది సాయి కుమార్  స‌ర‌స‌న జోడి అనే చిత్రంలో న‌టించాను. 2017లో ఆ సినిమాల‌కు సంత‌కం చేశాను. జెర్సీ టీమ్ తో ప్ర‌యాణం 2018లో మొద‌లైంది. తొలిగా సంత‌కం చేసిన‌వి ఆల‌స్య‌మ‌వుతున్నాయి. ఆ రెండూ వెన‌క్కి వెళితే.. అంత‌కు ముందే జెర్సీ రిలీజ‌వుతోంది. చాలా ఎగ్జ‌యిటింగ్ గానే ఉంది అని తెలిపింది. జెర్సీ క‌థాంశం.. ట్రావెలింగ్ పై మాట్లాడుతూ.. అర్జున్ - సారా జంట ప‌య‌నానికి సంబంధించిన క‌థ ఇది. 1986 స్టోరి.. 1996 స్టోరి ఉంటాయి. 86లో టీనేజ‌ర్ గా ప్రేమ‌క‌థ‌లో క‌నిపిస్తాను. త‌ర్వాత భార్య పాత్ర‌లో క‌నిపిస్తాను. గ్లామ‌ర్ పార్ట్ - ఎమోష‌న్ పార్ట్ రెండిటినీ ఇష్ట‌ప‌డ‌తాను అని తెలిపింది.

మొదటి సినిమాలోనే త‌ల్లి పాత్ర‌.. రిస్క్ కాదా? అని ప్ర‌శ్నిస్తే.. ప‌రిశ్ర‌మ కోణంలో ప‌రిశీలిస్తే రిస్క్ అనే అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో పాత్ర తీరుతెన్నులు వేరు.  జెర్సీ చిత్రంలో చ‌క్క‌ని ఎమోష‌న్ తో భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం వచ్చింది. అదే నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. టీనేజీ అమ్మాయిగా క‌నిపిస్తూనే.. త‌ల్లిగా క‌నిపించ‌డం  ఆస‌క్తిక‌ర‌మే. వేర్వేరు దశలలో అలా కనిపించడం రిస్క్ కాదని చెప్పింది. ఇంత‌కీ హీరోయిన్ కాక‌పోతే లాయ‌ర్ గా కొన‌సాగేవారా? అంటే ఛాన్సే లేద‌ని కిసుక్కున న‌వ్వేసింది ఈ బెంగ‌ళూరు బాలిక‌.
Tags:    

Similar News