నేటి ఉదయం 11 గం.లకు ఆర్.ఆర్.ఆర్ మీడియా సమావేశం అనగనే మీడియా సహా జనాల కళ్లన్నీ అటువైపే నిలిచాయి. ఆ హడావుడిలో మీడియా వేరొక సంగతిని మరిచింది. స్వయంకృషితో విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన శ్రవణ్ తొలి సారి హీరోగా నటించిన `ఎదురీత` ప్రచార కార్యక్రమం నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. అయితే మీడియా మాత్రం ఆ పొరుగునే పార్క్ హయత్ హోటల్లో జరుగుతున్న ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ గురించే టెన్షన్ పడింది. అంటే ఒక చిన్న హీరో సినిమాపై మీడియా అటెన్షన్ ఎలా ఉంటుందో.. భారీ స్టార్లతో తీసే సినిమాపై గురి ఎలా ఉంటుందో ఈ ఇన్సిడెంట్ చెబుతోంది. ఆర్.ఆర్.ఆర్ కంటే ముందే తలపెట్టిన ఎదురీత ఈవెంట్ ని షార్ప్ గా 11 గంటలకే ముగించారు కానీ - లేదంటే అసలు ఆ ఈవెంట్ సన్నివేశమేంటో? అన్న చర్చ సాగింది.
`ఎదురీత` సంగతికి వస్తే ఈ టైటిల్ వినగానే ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ మూవీ ఎదురీత గుర్తుకు వస్తుంది. అయితే ఆ క్లాసిక్ కి కానీ - ఈ సినిమాకి కానీ ఏమాత్రం సంబంధం లేదని దర్శక హీరోలు తెలిపారు. ఎదురీత అన్న టైటిల్ మాత్రమే ఈ సినిమాకి తీసుకున్నారు. కథాంశం పూర్తిగా మోడ్రన్ గా ఉంటుంది. నలభై వయసు తండ్రికి కొడుక్కి ఉన్న అనుబంధం .. ఆ ఇద్దరి మధ్యా ప్రవేశించిన విలన్ కథేంటి? అన్నది ఆద్యంతం ఉత్కంఠ భరితంగా చూపించారట. ఆసక్తికరంగా ఈ చిత్రంలో రాజమౌళి ఎంకరేజ్ చేసిన సహాయ నటుడు కం విలన్ శ్రావణ్ నటించారు. జక్కన్న తెరకెక్కించిన సై - మగధీర లోనూ అతడు నటించాడు. సై - దూకుడు - శ్రీమంతుడు - బిందాస్ - మగధీర - ఏక్ నిరంజన్ వంటి చిత్రాలతోనే అతడికి నటుడిగా గుర్తింపు దక్కింది.
`ఎదురీత`లో ఓ కీలక పాత్రలో నటించిన భద్రమ్ మాట్లాడుతూ ``చేపల్లో పులస చాలా స్పెషల్. ఎంతో రుచిగా ఉంటుంది. రేటు కూడా ఎక్కువే. ఎందుకంటే... నీటి ప్రవాహానికి పులస ఎదురీదుతుంది. ఎదురీత వల్లే పులసకు స్పెషల్ టేస్ట్. జీవితంలో ప్రతి మనిషికీ ఎదురీత తప్పదు. అందుకని, మనుషులంతా గ్రేట్. అటువంటి ఓ మనిషి కథే ఈ సినిమా. కథాబలం ఉన్న సినిమా. ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసిన శ్రవణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మంచి బలమున్న కథను ఎంచుకోవడంలో ఆయన పరిణితి ఏంటో అర్థమవుతుంది. ఇప్పటివరకూ సినిమాల్లో కనిపించిన శ్రవణ్ వేరు.. ఈ సినిమాలో శ్రవణ్ వేరు. కొన్ని సన్నివేశాల్లో అతడి నటన కంటతడి పెట్టిస్తుంది. ఆయనలోని నటుడిని ఇప్పటివరకూ ఎవరూ వాడుకోలేదు`` అంటూ ఎమోషనల్ గానే మాట్లాడారు. మొత్తానికి పులసలాగా శ్రవణ్ లాంటి నటులు ఏటికి ఎదురీదినా స్టార్లు కాలేకపోతున్నారు. ప్రభాస్ అంత హైట్ - వెయిట్.. గ్లామర్ ఉండీ అతడు ఇంకా క్యారెక్టర్ నటుడిగా మిగిలిపోయాడన్నది ఓ అభిమాని ఆవేదన. శ్రవణ్ ని హీరోని చేస్తూ ఓ తమిళ దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కావాల్సి వస్తోంది. కళ్యాణ్ రామ్ ముఖ్య అతిధిగా నేడు టీజర్ వేడుక జరిగింది. ``నన్ను సినిమా ఇండస్ట్రీకి కోడి రామకృష్ణగారు పరిచయం చేస్తే.. రాజమౌళి `సై` సినిమాతో బ్రేక్ ఇచ్చారు. రాజమౌళి గురించి మనకు తెలుసు... ప్రతి నిమిషం సినిమా గురించి ఆలోచిస్తారు. మా దర్శకుడు బాలమురుగన్ కూడా అంతే``నంటూ శ్రవణ్ తెలిపారు. అదీ కథ!!