నేను త‌ల్లిని కాబోతున్నానుః శ్రేయాఘోష‌ల్‌

Update: 2021-03-04 08:30 GMT
త‌న గాన‌మాధుర్యంతో అభిమానుల‌ను ఉర్రూత‌లూగించే ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌ని శ్రేయా ఘోష‌ల్.. ఇప్పుడు అంత‌కు మించిన తీయ‌టి వార్త‌ను చెప్పారు. తాను త‌ల్లికాబోతున్నానని ఆనందంగా ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. ఈ వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ పోస్టుకు తను గర్భంతో ఉన్న ఫొటోను యాడ్ చేశారు శ్రేయా. ఈ ఫొటోలో తన గర్భాన్ని చూసి మురిసిపోతున్నారు. శ్రేయాఘోషల్. దీనికి ‘‘బేబీ శ్రేయాదిత్య క‌మింగ్‌’’ అంటూ రాసుకొచ్చారు. తమ జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైందని, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంద‌ని శ్రేయ అన్నారు.

ఈ శుభ స‌మ‌యంలో మీ అంద‌రి ప్రేమ‌, ఆశీస్సులు కావాల‌ని ట్వీట్ చేశారు శ్రేయా ఘోష‌ల్. దీంతో.. ఫ్యాన్స్ శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. 2015లో త‌న మిత్రుడు శైలాదిత్యాను శ్రేయ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాము ముగ్గురం కాబోతున్నామ‌ని చాలా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారీ దంప‌తులు.

కాగా.. శ్రేయాఘోష‌ల్ గాత్రం గురించి కొత్త‌గా చెప్పాల్సింది లేదు. ఆమె అద్భుత‌మైన గొంతు ఎంతో మందిని పాటల పూదోట‌లో విహ‌రింప‌జేసింది. టాలీవుడు, బాలీవుడ్ తోపాటు సౌత్‌, నార్త్ లోని అనేక భాష‌ల్లో ఆమె పాట‌లు పాడారు. ఈ క్ర‌మంలో ప‌లు జాతీయ పుర‌స్కారాల‌ను కూడా సొంతం చేసుకున్నారు శ్రేయా.
Tags:    

Similar News