సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధది తెలుగు తెరపై 20 ఏళ్ల ప్రస్థానం. ఓ నార్త్ ఇండియన్‌ను పెళ్లాడాక సినిమాలకు దూరమైపోయిన జయసుధ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన జయసుధ.. తన ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి తీసుకురాలేదు. ఐతే ఈ మధ్య సడెన్‌గా ఆమె కొడుకు శ్రేయన్ కపూర్‌ను సినిమాల్లోకి తెచ్చేశారు జయసుధ. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడైన శ్రేయన్ 'బస్తీ' అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ శుక్రవారమే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా శ్రేయన్ మాట్లాడుతూ తనకు సినిమాల్లోకి వద్దామన్న చిన్నప్పటి నుంచి ఎనాడూ లేదని.. ఐతే అనుకోకుండా ఇప్పుడు సినిమాల్లోకి అడుగుపెడుతున్నానని చెప్పాడు. ''మా అమ్మ పెద్ద నటే అయినా నాకు మాత్రం యాక్టింగ్ మీద ఎప్పుడూ ఆసక్తి లేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను పెద్ద షూటర్ని. నేషనల్ లెవెల్‌లో టాప్-5లో చోటు సంపాదించాను. సినిమాల గురించి ఆలోచించకుండా షూటింగ్‌నే కెరీర్‌గా మలుచుకుంటున్న దశలో మూడేళ్ల కిందట మనసు మారింది. సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కలిగింది. దీంతో నిర్మాత లగడపాటి శ్రీధర్‌తో టచ్‌లో ఉన్నాను. కొన్ని కథలు పరిశీలిస్తుండగా.. మధు మంతెన అనుకోకుండా బస్తీ కథ చెప్పాడు. అది బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ఓ మంచి సినిమాతో హీరోగా పరిచయమవుతుండం ఆనందంగా ఉంది'' అన్నాడు జయసుధ నట వారసుడు.