ఆ ఫోటోగ్రాఫర్.. శ్రీయ రికమండేషనా??

Update: 2016-12-02 04:30 GMT
ఇప్పుడు మన సినిమాల తాలూకు పోస్టర్లు డిజైన్ చేయడానికి.. డిజైనర్లు ఇంకా లోకల్ వారే కాని.. సదరు పోస్టర్ కోసం ఫోటో షూట్ చేయడానికి మాత్రం ముంబయ్ నుండి ఫోటోగ్రాఫర్లను దించుతున్నారు. దాదాపు రోజుకు 10 లక్షలకు పైగా తీసుకునే డబూ రత్నాని వంటి ఫోటోగ్రాఫర్ 'జనతా గ్యారేజ్' సినిమా పోస్టర్ల కోసం ఎన్టీఆర్ తో ఫోటో షూట్ చేశాడు. ఇప్పుడు అపే పంథాను ఇతర స్టార్ హీరోల సినిమాలకు కూడా కొనసాగిస్తున్నారు.

మొన్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ ఆఖరి రోజున.. బాలయ్య అండ్ శ్రీయ ను తమ ఒరిజినెల్ గెటప్పుల్లో ఫోటోలు తీయడానికి.. ఈసారి చెన్నయ్ కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫ్‌ జి.వెంకట్ రామ్ విచ్చేశాడు. ఇతగాడికి దాదాపు 15 లక్షలపైనే రోజుకు చెల్లించాలి. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి అనేది బాలయ్య 100వ సినిమా కావడంతో.. దీనిని ప్రొడ్యూసర్లు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఇతగాడ్ని పిలిచారట.

సాధారణంగా వెంకట్ రామ్ అందరకి అందుబాటులో ఉండడు. కాకపోతే హీరోయిన్ శ్రీయకు మాత్రం మనోడు మాంచి ఫ్రెండ్. గతంలో శ్రీయ చేసిన మ్యాగ్జిమ్ ఇన్నర్ వేర్ ఫోటో షూట్.. అలాగే వేరే మ్యాగజైన్ల కోసం అమ్మడిని బికినీ టాపుల్లో అనేక ఫోటోలు ఇతనే తీశాడు. అతడి రేటెంత ఎక్కువో.. వర్కు కూడా అంతే రిచ్ గా ఉంటుందిలే. అందుకే శ్రీయ రికమండేష్ తో ఇప్పుడు శాతకర్ణి కోసం అతడు తన లెన్స్ పనితనం చూపించాడట. అది సంగతి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News