వీడియో : ఇంత అందం ఈమెకే సొంతం

Update: 2022-09-21 14:21 GMT
సినిమా ఇండస్ట్రీలో శ్రియ శరన్ అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతోంది. ఆమె వయసు నాలుగు పదులకు చేరువ అయ్యింది. అయినా కూడా ఆమె అందం పాతికేళ్ల అమ్మాయిల అందంతో పోటీ పడుతుంది అన్నట్లుగా ఉంటుంది. చీర కట్టినా.. బికినీ వేసినా.. మరే డ్రెస్ లో ఉన్నా కూడా అందం ఆమె సొంతం అన్నట్లుగా ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు.

తాజాగా శ్రియ తన అందంతో మరోసారి ఆకట్టుకుంది. సాంప్రదాయ డ్రెస్ లో ఎంత వరకు స్కిన్‌ షో చేయాలో అంతకు మించి అన్నట్లుగా స్కిన్‌ షో చేస్తూ తాజాగా ఈ  అమ్మడు ఫోటో షూట్‌ కి స్టిల్స్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ను స్వయంగా ఆమె తన ఇన్ స్టాలో షేర్‌ చేసింది.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా శ్రియ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. పై పెచ్చు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఒకింత ఎక్కువగానే అందంగా కనిపిస్తూ అందాల ఆరబోత చేస్తుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు ఉన్నా లేకున్నా కూడా వరుసగా ఇలా హాట్‌ ఫోటో షూట్స్ తో ఇన్ స్టా ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తుంది.

తాజాగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో చిన్న పాత్రలో నటించిన శ్రియ మళ్లీ హీరోయిన్ గా అవకాశం వస్తే తాను రెడీ అన్నట్లుగా మెసేజ్‌ పాస్ చేసేందుకు ఇలాంటి ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం శ్రియ అందాల ఆరబోత ను విమర్శిస్తూ ఉన్నారు.

ఆఫర్ల కోసం మరీ ఇంతగా చూపించాల్సిన అవసరం లేదేమో అంటున్నారు. కానీ ఆమె అభిమానులు మాత్రం ఆమె అందాల ఆరబోత ను ఆస్వాదిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రియకి యంగ్‌ హీరోలు కాకున్నా సీనియర్ హీరోలైనా హీరోయిన్ గా ఛాన్స్ లు ఇవ్వాలని కోరుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News