సీనియర్ హీరోయిన్ శ్రియ తన భర్త ఆండ్రీ కొస్చీవ్ తో కలిసి గత కొంతకాలంగా స్పెయిన్ లో ఉంటోంది. అయితే కరోనావైరస్ ప్రబలడం.. లాక్ డౌన్ విధించడం తదితర కారణాల వల్ల ఇద్దరూ స్పెయిన్ దేశంలోని బార్సెలోనా నగరంలోని తమ ఇంట్లో ఉండిపోయారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న దేశాలలో స్పెయిన్ ఒకటి. దీంతో బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు.
ఇలా ఉంటే ఆండ్రీకి ఈమధ్య పొడి దగ్గు.. జ్వరం రావడంతో శ్రియ ఆందోళన పడిందట. ఈ రెండు కరోనా లక్షణాలు కావడంతో ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి ఆండ్రీని తీసుకెళ్లి వైద్యులకు చూపించిందట. అయితే వారు మాత్రం ఇద్దరినీ ఇంట్లోనే ఉండమని.. సెల్ఫ్ ఐసోలేషన్ పాటించమని తిప్పి పంపారట. ఈ విషయం శ్రియ స్వయంగా ఒక ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం ఆండ్రీ బాగానే ఉన్నాడని కూడా వెల్లడించింది.
ఈ మాయదారి కరోనా సాధారణ ప్రజలనే కాదు.. దేశాధినేతలను.. సెలబ్రిటీలను ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఎలాంటి ఎలాంటి వ్యక్తిని అయినా "మూసుకుని కూర్చోరా పూలచొక్కా" అన్నట్టుగా ఓ పాపులర్ తెలుగు డైలాగ్ వేసినట్టుగా అనిపిస్తోంది. ఇలాంటప్పుడే "మాకన్నీ తెలుసు.. మేమే గొప్ప.. మాదే గొప్ప దేశం.. మాకే డబ్బుంది.. మమ్మల్ని ఎవరు వెంట్రుక కూడా పీకలేరు" అని రెచ్చిపోయే వారికి సర్వం'బొచ్చు' అనే తత్వం బోధపడుతుంది! కొన్ని నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.