అందాల కథానాయిక శ్రీయ రష్యాకి చెందిన ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి విదేశీ పర్యటనలతో బిజీ అయ్యింది. ఏడాది పైగానే దాంపత్య జీవన మధురిమల్ని ఆస్వాధించింది. ఇప్పుడు మరోసారి ముఖానికి మేకప్ వేసుకుని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. కోలీవుడ్ లో సందైకారి అనే సినిమా లో నటిస్తోంది. పెళ్లి తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం ఇదే. ఇందులో సాప్ట్ వేర్ కంపెనీ బాస్ గా శ్రీయ నటిస్తోంది. ఇటీవలే లండన్ లో తనపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే లండన్ పోలీసులు శ్రీయకు పెద్ద షాక్ ఇచ్చిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లండన్ లోనే అతి పెద్ద విమానశ్రయం అయిన స్టాన్ ఫోర్డ్ ఎయిర్ పోర్టులో నటుడు విమల్- శ్రియపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారట. ఆ సమయంలో షూటింగ్ అనంతరం శ్రీయ భద్రతకు సంబంధించిన సరిహద్దులను దాటి విమానాశ్రయంలోనికి అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా వెళ్లిందిట. దీంతో పోర్టు వద్ద గస్తీ కాస్తున్న పోలీస్ సిబ్బంది ఒక్కసారిగా చుట్టు ముట్టి శ్రీయ తలకు తుపాకులు గురు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారట. ఎవరు నువ్వు? ఎందుకొచ్చాయ్? లేడీ టెర్రరిస్ట్ వా? అనుమతి లేకుండా ఎలా వస్తావ్? అని చాలా సేపు ప్రశ్నల వర్షం కురిపించారుట. దీంతో దూరంగా ఉన్న నటుడు విమల్ అది గమనించి వెంటనే అక్కడికి వెళ్లి శ్రీయ పాస్ పోర్ట్ సహా ఇంకా సంబంధిత ఆధారాలు చూపించి అక్కడ నుంచి తీసుకొచ్చాడుట.
దీంతో శ్రియ ఆ షాక్ నుంచి తేరుకునేందుకే కొన్ని గంటలు పట్టిందిట. శ్రియను అలా ప్రశ్నించే సమయంలో ఎలాంటి బదులివ్వకుండా సొమ్మసిల్లి పడిపోయేంత సీన్ క్రియేట్ అయిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆ సమయంలో శ్రీయ ఏమాత్రం అనుమానాస్పదంగా వ్యవహరించినా... లేక సరైన సమయంలో విమల్ గమనించక పోయినా అక్కడ పరిస్థితి మరోలా ఉండేదని చూసిన వారు చెబుతున్నారు. మొత్తానికి అమ్మడు పెద్ద ప్రమాదం నుంచే బయట పడింది సుమీ.