సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ గత కొంత కాలంగా తన భర్తతో పాటు స్పెయిన్ దేశం లోని బార్సిలోనా నగరంలో ఉంటున్న సంగతి తెలిసిందే. భర్త ఆండ్రీ కొస్చీవ్ తో కలిసి యూరోప్ అంతటా చుట్టేస్తూ భార్యాభర్తల బంధంలోని మధురిమలను ఆస్వాదిస్తూ.. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉండేది. అయితే కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో బీభత్సం సృష్టించింది. అలాంటి దేశాలలో స్పెయిన్ ఒకటి. శ్రీయ రెండు మూడు రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో తన భర్తకు లక్షణాలు కనిపించాయట. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్తే ఇంట్లోనే ఉండమన్నారని..అందుకే ఐసోలేషన్ పాటిస్తున్నామని తెలిపింది.
ఇక చూసుకోండి.. ఆండ్రీకి కరోనా వచ్చేసిందని.. ఆరోగ్యం సరిగాలేదని.. ఎన్నో రకాలైన పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ రోజు ఆండ్రీ పుట్టినరోజు సందర్భంగా శ్రీయ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "హ్యాపీ బర్త్ డే టు మై హార్ట్ బీట్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో ఇద్దరూ చక్కగా రెడీ అయి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. ఈ ఫోటో చూస్తుంటే ఫ్రెష్ గా తీసినట్టే ఉంది కానీ పాత ఫోటో లాగా కనిపించడం లేదు. శ్రీయ ఇండియన్ స్టైల్లో చుడీదార్ ధరిస్తే.. ఆండ్రీ బ్లేజర్ ధరించి దొరబాబులా స్మైల్ ఇచ్చాడు.
దీంతో శ్రియ అభిమానులు ఆండ్రీపై పిచ్చ రూమర్లు రాసిన వారికి గట్టి సమాధానం ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది నెటిజన్లు ఆండ్రీకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఒక నెటిజన్ మాత్రం "అలా హగ్ చేసుకుంటే నీకు కరోనా గ్యారెంటీ" అంటూ హెచ్చరించారు. ఏదైతేనేం శ్రియ మాత్రం ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఏదో ఒక ఒక కారణంతో హాట్ టాపిక్ గా నిలిచింది.