బాలయ్య.. పక్క సీట్లో శ్రీయ.. షాక్

Update: 2017-06-06 04:22 GMT
కత్తులు, పోరాటాలు ఏమి కొత్త కావు.ఆయుధం అవసరం లేకుండా చంపగలిగే బొబ్బిలి పులి ఈ సీనియర్ స్టార్. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 101 వ చిత్రం షూటింగ్ పోర్చుగల్లో చేస్తున్నారు. అతి వీర భయానకంగా పోరాటాలు బాలయ్య తానే సొంతంగా చేస్తున్నాడు ఈ పూరి జగన్నాధ్ కొత్త సినిమా కోసం. ఈ సినిమాలో మాఫియా డాన్ లా కనిపించబోతున్నాడనే సంగతి తెలిసిందే.

సాదారణంగా మన సినిమాలో కార్ ఛేజింగ్లు ఉన్నప్పుడూ పోరాట నిపుణులు సమక్షం లో చేస్తారు లేదా వాళ్లే చేస్తారు.  ఈ సినిమాలోకూడా ఒక కార్ చేజ్ యాక్షన్ సీక్వెన్స్ లిస్బన్ లో జరుగుతోంది.ఈ యాక్షన్ లో కార్ని 360 డిగ్రీలు తిప్పి తరవాత ముందుకు వెళ్లవలిసి ఉంది. దానికి బాలయ్య బాడి డబుల్ (డూప్) ని నిరాకరించి తానే స్వయంగా చేశాడంట. ఆ కారులో పక్కనే కూర్చుని ఉన్న శ్రీయకు బాలయ్య తెగువ పట్టుదల చూసి షాక్ తగిలేసిందట. ఇప్పుడు బాలయ్య ఉన్న వయసు లో ఉన్నఎవరైనా డూప్ నే వాడతారు. అదే క్షేమం కూడా. కానీ ఈ వయసులోను అతని విజృంభణ చూసి స్పీచ్ లెస్ అయ్యింది శ్రీయ. అసలే బాలయ్యకు యాక్షన్ అంటే పూనకం వచ్చినవాడిలా అభిమానులు ఈలలు కోసం రెచ్చిపోయి చేస్తారు. పాపం శ్రీయ బాలయ్యను ఎప్పుడు ఇంత ఆవేశంగా చూసి ఉండదు అందుకే కాస్త భయపడి ఉంటుంది.

బాలయ్య పూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఇంకా పేరు ఏమి పెట్టలేదు. ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా శ్రీయ నటిస్తుంది. పూరి జగన్నాధ్ మరియు భావ్య క్రియేషన్స్ వాళ్ళు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య పుట్టిన రోజు దగ్గర పడటం తో నందమూరి అభిమానులకు ఫస్ట్ లుక్ తో కానీ ఒక టీజర్ తో గాని ఆ రోజు మంచి గిఫ్ట్ ఇస్తారేమో చూడాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News