మల్టీ టాలెంటెడ్ గాళ్ అనిపించుకుంది శ్రుతిహాసన్. మ్యూజిషియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత యాక్ట్రెస్ గా టర్న్ అయ్యింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ లో సౌత్ నుంచి నార్త్ వరకు దున్నేస్తోంది. కెరీర్ జోరుమీద వున్న ఈ సమయంలో ఆమెకి దర్శకత్వంవైపు మనసు మళ్లిందట. ఇప్పుడెందుకమ్మా అని సన్నిహితులు, కుటుంబ సభ్యులు వారిస్తున్నా శ్రుతి మాత్రం ఆగలేనంటోందట. చేతిలో ఉన్న సినిమాలు పూర్తవ్వగానే కెప్టెన్ కుర్చీ ఎక్కాల్సిందే అని డిసైడ్ అయ్యిందట. తన తండ్రి కమల్ హాసన్ లాగే శ్రుతి కూడా ఆల్‌రౌండర్ అనిపించుకోవాలని డిసైడ్ అయ్యిందన్నమాట. మరింతకీ ఆ సినిమాలో ఆమె నటిస్తుందా లేదా అన్నది తెలియరాలేదు.
శ్రుతిహాసన్ కి దర్శకత్వంపై మొదట్నుంచీ మక్కువ ఉందట. కానీ అనుకోకుండా నటి అయ్యిందట. హీరోయిన్ గా బోలెడన్ని ఆఫర్లు దక్కించుకుంటున్నా అవేమంత ఆమెకి కిక్కివ్వడం లేదట. అందుకే తనలోని దర్శకత్వం టాలెంట్‌ని చూపించి సంతృప్తి చెందాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. కానీ కెప్టెన్ అయినప్పటికీ కథానాయికగా నటించడం మాత్రం మానుకోనని చెబుతోందట. మధ్యలో ఆర్నెళ్లు విరామం తీసుకుని తన మనసులో ఉన్న కథని తెరపై చూపించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నిర్మాతని కూడా సెట్ చేసిందని తెలిసింది. శ్రుతికి చిన్నప్పట్నుంచీ కథలు చెప్పడం అలవాటట. చిన్నప్పుడు స్నేహితులకి భయంకరమైన కథలు చెప్పి వాళ్లని ఆశ్చర్యపోయేలా చేసేదట. అలాంటి కథనే తెరపై చూపించాలని ఆమె డిసైడైనట్టు తెలిసింది.