ఫొటోటాక్‌ : ఇలా నిన్ను ఎవరు ఇష్టపడరు

Update: 2021-05-28 04:30 GMT
హీరోయిన్‌ లు ఎప్పుడైనా అందంగా కనిపించేందుకే ఇష్టపడతారు. మొబైల్‌ లో ఒక సెల్ఫీ తీసుకోవాలన్నా కూడా వారు అందంగా రెడీ అయ్యి ఆ తర్వాతే తీసుకుంటారు. ఇక హీరోయిన్స్‌ ఫొటో షూట్ ల విషయం చెప్పనక్కర్లేదు. ఎక్కువ శాతం మంది హీరోయిన్స్ డీ గ్లామర్‌ పాత్రల్లో నటించేందుకు అస్సలు ఇంట్రెస్ట్‌ చూపించరు. మినిమం మేకప్ లేకుండా ఏ హీరోయిన్ కూడా కనిపించే అవకాశం లేదు. కాని అందరు హీరోయిన్స్ లోకి తాను ఎప్పుడూ ప్రత్యేకం అంటూ నిరూపించుకునే ముద్దుగుమ్మ శృతి హాసన్‌. టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. బాలీవుడ్ ఇలా పాన్ ఇండియా గుర్తింపు ఉన్న శృతి హాసన్ మాత్రం తన చిత్ర విచిత్రమైన ఫొటో షూట్ లను సోషల్‌ మీడియాలో ఎప్పుడూ షేర్‌ చేస్తూనే ఉంటుంది.

పవన్‌ కళ్యాణ్‌ తో ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించిన శృతి హాసన్‌ టాలీవుడ్‌ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ. అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించగల ముద్దుగుమ్మ. అలాంటి శృతి హాసన్ తాజాగా నెట్టింట షేర్‌ చేసిన పిక్స్‌ ఆమె అభిమానులతో పాటు అందరికి కూడా కాస్త షాకింగ్ గా ఉన్నాయి. శృతి హాసన్ పిశాచి అయితే ఎలా ఉంటుంది అనేందుకు ఉదాహరణగా ఈ పిక్స్‌ ను షేర్ చేసింది. కళ్లు అంత పెద్దవిగా బ్లాక్ అండ్‌ వైట్ లో ఒక వింతైన కాస్ట్యూమ్‌ లో ఈమెను చూసేందుకు అభిమానులు ఎవరు ఇష్టపడటం లేదు. నిన్ను ఇలా చూడాలనుకోవడం లేదు.. నిన్ను ఎవరు ఇలా ఇష్టపడరు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శృతి హాసన్‌ ప్రస్తుతం మోస్ట్‌ అవైటెడ్‌ పాన్ ఇండియా యాక్షన్‌ మూవీ సలార్ లో నటిస్తుంది. ప్రభాస్‌ కు జోడీగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ తో రొమాన్స్ చేయబోతున్న శృతి హాసన్ ను ఇలాంటి లుక్ లో చూడాల్సి వచ్చిందేంట్రా బాబు అంటూ మరి కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శృతి ఈ పిశాచి లుక్ వైరల్‌ అయ్యింది.
Tags:    

Similar News