ఈ మధ్యకాలంలో చాలామంది షూటింగులను జూనియర్ ఆర్టిస్టులతో కాకుండా.. లైవ్ లొకేషన్లలో తీసేస్తున్నారు. లొకేషన్ తాలూకు రియాల్టీ రావాలంటే ఇలాగే చేయాలంట. గతంలో ఇలాగే మలేసియా షూటింగ్ లో రజనీకాంత్ లుక్ ను ఫోటోలు తీసి అందరూ ఫేస్ బుక్ లో పెట్టేశారు. అలా చేయకండి బాబోయ్ అని మొత్తుకున్నా కూడా పనవ్వలేదు. ఇప్పుడు సేమ్ కష్టం ఎస్ 3.. సింగం 3.. కు కూడా వచ్చింది.
హరి దర్శకత్వంలో సూర్య, అనుష్క, శ్రుతిహాసన్ నటిస్తున్న ‘ఎస్3’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. విశాఖపట్టణంలో తొలి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఒక చిక్కొచ్చిపడింది. అది కూడా సూపర్‌స్టార్ నటించిన ‘కబాలి’కి ఎదురైన కష్టంలాంటిదే. వైజాగ్ లో షూటింగ్ చూడ్డానికి వస్తున్న ప్రజలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారట. దీంతో చిత్రయూనిట్ అప్రమత్తమై.. ‘దయచేసి షూటింగ్ దృశ్యాలను షేర్ చేయకండి’ అంటూ సోషల్ మీడియా ద్వారానే విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒక ప్రక్కన శృతి హాసన్ లైవ్ లో షూటింగులో ఉంటే.. క్లిక్కులు కొట్టకండి అంటే కుదురుతుందా? శృతి చేసి కొట్టకుండా ఎలా ఉంటాం బాసూ అనేయరూ!!