నాకు టీమ్ ఉంది.. నేను ఇలాగే ఆలోచిస్తాః శృతిహాస‌న్‌

Update: 2021-05-28 09:30 GMT
క‌రోనా విజృంభిస్తున్న వేళ‌.. స‌హాయం కోసం ఎద‌రుచూస్తున్న వారికి లెక్కేలేదు. అయితే.. ఇదే అదునుగా భావించి డ‌బ్బుల కోసం త‌ప్పుడు స‌మాచారం ఇచ్చే వాళ్లకు కూడా కొద‌వ‌లేదు. ఈ నేప‌థ్యంలో.. స‌హాయం చేసేట‌ప్పుడు ఆచితూచి స్పందిస్తాన‌ని చెబుతోంది హీరోయిన్ శృతిహాస‌న్‌. నిజానిజాలు తెలుసుకునేందుకు త‌న‌కు ఓ టీమ్ కూడా ఉంద‌ని చెబుతోంది.

ఇక‌, స‌హాయంలో డ‌బ్బును మాత్ర‌మే ఉన్న‌తంగా చూడొద్ద‌ని చెబుతోందీ బ్యూటీ. ఒక్కోసారి మాట స‌హాయం కూడా ఎంతో పెద్ద ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌ని అంటోంది. ‘‘డ‌బ్బు అంద‌రికీ అవ‌స‌ర‌మే. కానీ.. కేవ‌లం డ‌బ్బు ఇస్తేనే పెద్ద సహాయం చేసినట్టు కాదు. మాట సహాయం కూడా పెద్ద ప్రభావం చూపొచ్చు.’’ అని చెప్పింది.

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే అభ్య‌ర్థ‌న‌ల్లో నిజ‌మైన‌వి, న‌కిలీవి కూడా ఉంటాయ‌న్న శృతి.. వాస్త‌వాలు తెలుసుకునేందుకు శ్రీరామ్ అనే వ్య‌క్తి త‌న‌కు స‌హాయం చేస్తున్నాడ‌ని చెబుతోంది. వాస్త‌వ స‌మాచారాన్ని త‌న‌కు వాళ్లు తెలియ‌జేస్తార‌ని, ఆ త‌ర్వాతే తాను స్పందిస్తాన‌ని చెబుతోంది.

కాగా.. ఇటీవ‌ల రేణుదేశాయ్ కూడా ఈ త‌ర‌హా ఇబ్బందులు ఫేస్ చేసిన విష‌యం తెలిసిందే. కొవిడ్ తో ఇబ్బందులు ప‌డుతున్న వారికి స‌హాయం చేస్తున్న రేణును.. త‌మ‌కు డ‌బ్బులు కావాల‌ని కొంద‌రు ఇబ్బంది పెడుతున్నార‌ట‌. ఇవ్వ‌క‌పోతే చ‌నిపోతామ‌ని కూడా అంటున్నారట‌. అయితే.. తాను అవ‌స‌రాలు మాత్ర‌మే తీరుస్తాన‌ని, డ‌బ్బులు చేతికి ఇవ్వ‌న‌ని స్ప‌ష్టం చేసింది రేణు.
Tags:    

Similar News