చారుశీల ట్రెండింగ్‌

Update: 2015-08-12 10:09 GMT
శ్రుతిహాస‌న్‌ ని ఇప్పుడంతా చారుశీల అనే పిలుస్తున్నారు. `శ్రీమంతుడు`లో పోషించిన ఆ పాత్ర శ్రుతికి అంత బాగా క‌నెక్ట్ అయ్యింది. అందుకే ఆమె కూడా `ఆస్క్ చారుశీల` పేరుతోనే ట్విట్ట‌ర్‌ లో మాటా మంతీ కార్య‌క్ర‌మం చేసింది. శ్రుతి ఆన్‌ లైన్‌ లోకి వ‌చ్చేస‌రికే బోలెడ‌న్ని కొశ్చెన్లు. ఆస్క్ చారుశీల ట్విట్ట‌ర్‌ లో ఒక్కసారిగా  ట్రెండింగ్ అయిపోయింది. అది కూడా నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ లో. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా న‌టిస్తోంది కాబ‌ట్టి శ్రుతికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా శ్రీమంతుడు కూడా హిట్ టాక్ తెచ్చుకొంది. అందుకే శ్రుతి ట్విట్ట‌ర్ మాటామంతీకి క్రేజీగా స్పంద‌న ల‌భించింది. అయితే శ్రుతి ఇచ్చిన  స‌మాధానాలు మాత్రం పిచ్చెక్కించాయి.
 
మీకు ఎలాంటి మ్యూజిక్ ఇష్ట‌మంటే... అన్ని ర‌కాల మ్యూజిక్ అని చెప్పింది. హాలీవుడ్‌లో న‌టించే ఛాన్స్ వ‌స్తే? అని అడిగితే చాలా పేర్లున్నాయి అని  చెప్పింది. డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? అంటే లేదు అని...  ఇలా చాలా కొశ్చెన్ల‌ కు అన్నీ, అంద‌రూ, లేదు, ఉంది అని దిమ్మ‌తిరిగే స‌మాధానాలు ఇచ్చింది. అయితే శ్రుతి చెప్పిన కొన్ని విష‌యాలు మాత్రం ఆక‌ట్టుకొనేలా అనిపించాయి. ఆమె న‌టి కాక‌పోయుంటే ఏరోనాటిక‌ల్ ఇంజ‌నీర్ అయ్యేద‌ట‌. త‌న ఫేవ‌రేట్ పెంపుడు జంతువు పిల్లి అని చెప్పింది. త‌బ‌లా, పియానో బాగా వాయిస్తుంద‌ట‌. అయితే తండ్రి క‌మ‌ల్ ఇంట్లో  ఎలా పిలుస్తుంటారు?  మీకేమైనా నిక్ నేమ్ ఉందా? అని అడిగితే మాత్రం `అదో పెద్ద సీక్రెట్` అని చెప్పింది. శ్రుతిని క‌థానాయ‌కుడు విశాల్ కూడా ఓ కొచ్చెన్ అడిగాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యూజిక్ ఆల్బ‌మ్ ఎప్పుడు చేస్తావ్‌, దాని గురించి ఎదురు చూస్తున్నాం మేడ‌మ్‌.. అన్నాడు. ఆ ట్వీట్‌ కి `త్వ‌ర‌లో త్వ‌ర‌లో... ` అని సమాధాన‌మిచ్చింది.
Tags:    

Similar News