శృతి కన్ఫాం చేసినట్లేనా?

Update: 2017-12-04 05:28 GMT
సౌత్ సుందరి శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ అంటూ.. లండన్ కు చెందిన ఆర్టిస్ట్ మైకేల్ కోర్సలే పేరు చాలాకాలంగా వినిపిస్తూనే ఉంది. ఆ మధ్యన తనకు మైకేల్ కు ఎలాంటి రిలేషన్ లేదని ఓ సారి ఓపెన్ గా చెప్పి ఒప్పించేందుకు శృతి ప్రయత్నించిన మాట వాస్తవమే. అయితే.. ఆ తర్వాత కూడా శృతి-మైకేల్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా కమల్ హాసన్ తో మైకేల్ ముచ్చట్లాడడం కూడా మీడియా లీక్ చేసేసింది.

కొంతకాలం క్రితం ఇతడిని తన తల్లి సారికకు కూడా పరిచయం చేసింది శృతి హాసన్. ఇంతటితో వ్యవహారం ఏమీ ఆగిపోలేదు. తాజాగా చెన్నైలో తన ఫ్యామిలీకి బాగా సన్నిహితులకు చెందిన ఓ పెళ్లికి అటెండ్ అయింది శృతి. ఆ వెడ్డింగ్ కి.. మైకేల్ కోర్సలేను వెంటేసుకుని వెళ్లడమే కాదు.. అతడికి పక్కా ఇండియన్ గెటప్ కూడా వేసేయడం ఆశ్చర్యకరం. అమ్మా నాన్నలకు పరిచయాలు అయిపోయాయి.. ఇప్పుడు ఫ్యామిలీ ఈవెంట్స్ కు కూడా కలిసి హాజరు అయిపోతున్నారు అంటే.. సహజంగానే వీరిద్దరి రిలేషన్ పై ఓ అంచనాకు వచ్చేయడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఇతనితో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా నెట్ లో పెట్టేస్తోంది కూడా.

గతంలో నాగచైతన్య- సమంతలు కూడా ఇదే తరహాలో తమ రిలేషన్ ని జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. మెల్లమెల్లగా ఒక్కో విషయాన్ని రివీల్ చేస్తూ.. రీసెంట్ గానే ఒక్కటయ్యారు. ఇప్పుడు శృతి హాసన్ ప్రేమ వ్యవహారం కూడా ఇలాగే ఉందని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. మరి ఈ విషయమేదో కాస్త ఓపెన్ గా చెప్పేయచ్చుగా శృతీ!
Tags:    

Similar News