మైఖేల్ కోర్సలే తో బ్రేకప్ తర్వాత శ్రుతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ఇద్దరు సీరియస్ గా లవ్వాయణం సాగిస్తున్నారు. ఇన్ స్టా వేదికగా ఇద్దరిమధ్య బాండింగ్ గురించి వివిధ రూపాల్లో శ్రుతి రివీల్ చేసింది. అయితే మైఖెల్ కోర్సలేతో ఎదురైన కొన్ని అనుభవాల నేపథ్యంలో జాగ్రత్త పైడి శంతను విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపించింది. కండీషన్స్ అప్లై అంటూ శంతను తో లైఫ్నిముందుకు తీసుకెళ్తోంది.
అయితే ఇటీవలే ఇద్దరికి బ్రేకప్ జరిగిందని మీడియాలోకథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో శ్రుతి కొత్త ప్రేమాయణం కూడా కటీఫ్ అయిందంటూ అన్ని మీడియా సంస్థల్లో జోరుగా ప్రచారం సాగింది. 'నాతో నేను సరదాగా ఉంటాను. నాలా నేను..నాతో నేను ఉంటేనే బాగుంటుంది. నాజీవితాన్ని నేనే ఇష్టపడతాను' అంటూ నేను అనే పురాణం తెరపైకి తెచ్చింది.
దీంతో ఇలా ఒంటరిగా ఫీలై శ్రుతిహాసన్ వేదనకి గురవుతుందని అర్ధమైంది. కోర్సలే తర్వాత శంతను కూడా దూరమయ్యాడనే భావించారంతా. కానీ అమ్మడు తాజాగా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
బ్రేకప్ వార్తలకు చెక్ పెడుతూ ఇన్ స్టా స్టోరీస్ లో ప్రియుడితో ఉన్న ఫోటోని పంచుకుంది. ఇందులో ఇద్దరు కౌగిలించుకుని పరవశిస్తున్నారు. శంతను చేయి శ్రుతిహాసన్ కుర్రుల్లో ఉండగా...ఆ చేతిలో శ్రుతిహాసన్ చేయి వేసి కనిపిస్తుంది. ఈ ఫోటోకి 'నేను కోరుకునేది ఇదే' అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
అలాగే ఓ మీడియా సంస్థతో శంతను గురించి ఆసక్తికరంగా స్పందించింది. 'శంతను మంచి స్నేహితుడు. అతను ఓ అద్భుతం. ఎంతో ప్రతిభావంతుడు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు' అని చెప్పుకొచ్చింది. అలాగే తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడతాను. మనసులో భావాలను పంచుకోవడానికి ఇది మంచి వేదిక అని అంటోంది.
మొత్తానికి శంతను రిలేషన్ గురించి ఈ రకంగా చెప్పకనే చెప్పింది. దీంతో బ్రేకప్ వార్తలకు పుల్ స్టాప్ పడినట్లే. ప్రస్తుతం శ్రుతిహాసన్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి...నటసింహ బాలకృష్ణ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు నటించిన 'వాల్తేరు వీరయ్య'...'వీరసింహారెడ్డి' రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.