వీడియో : తాగి డాన్స్‌ ఏంటీ అమ్మడు?

Update: 2020-01-29 11:44 GMT
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూతురైన శృతి హాసన్‌ ఆయన పేరు చెప్పుకుని హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. కాని అతి తక్కువ సమయంలోనే ఆయన పేరుతో కాకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ ను ఏర్పాటు చేసుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం మల్టీ ట్యాలెంటెడ్‌ అంటూ అందరితో ప్రశంసలు దక్కించుకుంది. నటిగా.. సింగర్‌ గా.. మ్యుజీషియన్‌ గా ఇలా పలు రంగాల్లో తన ప్రావిణ్యంను ప్రేక్షకులకు చూపిస్తూనే ఉంది.

ఇటీవల ఈ అమ్మడి పుట్టిన రోజు. లండన్‌ లో పుట్టిన రోజు జరుపుకున్న శృతి హాసన్‌ తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ లండన్‌ వీధుల్లో హ్యాపీ బర్త్‌ డే డాన్స్‌ అంటూ డాన్స్‌ చేసింది. స్నేహితులతో కలిసి లండన్‌ లో తన బర్త్‌ డే వేడుక జరుపుకున్న తర్వాత శృతి హాసన్‌ ఇలా వీధుల్లో చిందులు వేసింది. ఆ వీడియోను స్వయంగా సోషల్‌ మీడియాలో పెట్టి తన ఆనందంను ఫాలోవర్స్‌ తో పంచుకుంది. నా బర్త్‌ డే.. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే ఇలా డాన్స్‌ చేస్తున్నాను అంటూ పోస్ట్‌ పెట్టింది.

ఆమద్య శృతిహాసన్‌ తనకు తాగే అలవాటు ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు ఆ విషయాన్ని తీసుకు వచ్చి కొందరు నెటిజన్స్‌ బర్త్‌ డే పార్టీ అంటూ బాగానే తాగేసినట్లున్నావు కదా.. రోడ్డు మీద డాన్స్‌ లు ఏంటీ అమ్మడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె వీడియోకు నెటిజన్స్‌ పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేస్తున్నారు. నీవు తాగి డాన్స్‌ చేసినా కూడా అది తాగి చేసినట్లుగా లేదు అంటూ మరికొందరు అన్నారు. మొత్తానికి శృతి హాసన్‌ హ్యాపీబర్త్‌ డే డాన్స్‌ వీడియో వైరల్‌ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News