దీపావ‌ళి వేళ‌.. ప్రియుడి కౌగిలిలో బంధీగా శ్రుతి!

Update: 2021-11-05 08:34 GMT
ఓవైపు శ్రుతి హాస‌న్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా కంబ్యాక్ అయిన తీరు ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ జ‌ర్నీలో ఎంత బిజీగా ఉన్నా..ప‌ర్స‌న‌ల్ లైఫ్ ని ఎంత మాత్రం కోల్పోవ‌డానికి శ్రుతి ఇష్ట‌ప‌డ‌దు. విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్స‌లేతో డేటింగ్ .. బ్రేక‌ప్ త‌ర్వాత శ్రుతి కొత్త బోయ్ ఫ్రెండ్ తో ప్రేమాయ‌ణం మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. స్వ‌దేశీప్రియుడు శాంత‌ను హ‌జారీకాతో ఈ బ్యూటీ డీప్ ల‌వ్ లో ఉంది. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా శంత‌నుతోనే టైమ్ గ‌డుపుతోంది. ముంబై లో లివిన్ రిలేష‌న్ షిప్ స‌హా విదేశీ షికార్ల‌తోనూ ఈ జంట హాట్ టాపిక్ గా మారుతోంది. కెరీర్ ప‌రంగానూ శంత‌ను ని పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా దీపావ‌ళి సంద‌ర్భంగా శ్రుతి స‌ఖుడి కౌగిలో లో బంధీగా మారిపోయింది. ఈ ప్ర‌త్యేక‌ సంద‌ర్భంగా ఇద్దరు పండుగ దుస్తుల్లో ముస్తాబ‌య్యారు.

శ్రుతి హాస‌న్ చ‌క్క‌గా చీర క‌ట్టుకుని సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా రెడీ అయింది. త‌న ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో త‌మిళ సంప్ర‌దాయం క‌నిపించేలా రెడీ కాగా.. శంత‌ను పండుగ మిరుమిట్ల ప‌ట్టు దుస్తుల్లో త‌ళుక్కున మెరిసాడు. అత‌డి ఒడిలో శ్రుతి హాస‌న్ ఒదిగిపోయి ప్రియుడిని గ‌ట్టిగా హ‌త్తుకుంది. శంత‌ను ప్రియురాలిని అంతే ఇదిగా హ‌త్తుకున్నాడు. ఇలా ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు హ‌త్తుకుని న‌వ్వులు చిందిస్తూ కెమారాకి ఫోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. గ‌తంలో ఇలాంటి వ్య‌క్తిగ‌త ఫోటోల్ని శ్రుతి హాస‌న్ పెద్ద‌గా బ‌య‌ట‌కు తెచ్చేది కాదు. ఒక‌వేళ లీక్ అయినా అందులో ప్రియుడితో ఘాటైన ఫోజుల్లో క‌నిపించేది. కానీ ఈసారి మాత్రం శాంత‌ను హ‌జారికాతో అలాంటి స‌న్నివేశాల‌కు దూరంగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

మైఖెల్ తో అనుబంధం ఊహించ‌ని రీతిలో బ్రేక‌ప్ అయ్యాక శ్రుతి స‌రైన స్నేహం కోసం ఎంత‌గానో వేచి చూసిన సంగ‌తి తెలిసిందే. శంత‌ను హజారికాలో తాను ఆశించిన ల‌క్ష‌ణాలు అన్నీ క‌నిపించాయి. అత‌డితోనే ప్ర‌తి విష‌యంలో ఎంతో చ‌నువును క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా చిత్రం `స‌లార్` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రుతి హాస‌న్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. దీంతో ఈ సినిమాపై అమ్మ‌డు కూడా భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. పాన్ ఇండియా క్రేజ్ కోసం శ్రుతి ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తోంది. ఆ ఛాన్స్ స‌లార్ తో వ‌చ్చింది. మ‌రి స‌క్సెస్ అనేది అంతిమంగా డిసైడ్ చేసేది కాబ‌ట్టి అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.




Tags:    

Similar News