అందాల కథానాయిక శ్రుతిహాసన్ నటించిన రెండు సినిమాలు నువ్వా నేనా? అంటూ ఈ సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య .. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి.. సంక్రాంతి కానుకగా విడుదలవుతుండగా ఈ రెండిటిలోను శ్రుతి కథానాయిక. నేటి సాయంత్రం వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేదికపై శ్రుతి డిజైనర్ శారీ లుక్ తో అదరగొట్టింది. అంతకుమించి తన స్పీచ్ తో ఆకట్టుకుంది.
ప్రీరిలీజ్ వేడుకలో శ్రుతి మాట్లాడుతూ-``బాలకృష్ణ గారు.. ఎంతో పాజిటివ్. ఎంతో ఎనర్జిటిక్ హీరో. గోల్డెన్ హార్ట్ ఉన్న హీరో..`` అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. ముఖ్యంగా జై బాలయ్య అంటూ శ్రుతి నందమూరి అభిమానులను ఎంతో ఉత్సాహపరిచింది. అంతేకాదు ఇదే వేదికపై శ్రుతిహాసన్ తన దర్శకుడు గోపిచంద్ మలినేని గురించి ప్రస్థావిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యింది. పరిశ్రమలో తనకు ఒక అన్నయ్య (గోపిచంద్ మలినేని) ఉన్నాడని అతడితో వరుసగా మూడు సినిమాలు చేసానని శ్రుతి ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ఇదే వేదికపై శ్రుతి గురించి మాట్లాడుతూ.. గోపిచంద్ మలినేని తన సోదర సహోదర ప్రేమను కనబరిచారు. అతడు తన కథానాయిక గురించి చెబుతూ... శ్రుతి అద్భుత నటి అని పొగిడేశారు. తనతో మూడో సినిమా చేస్తున్నా. నా కెరీర్ కి లక్కీ హీరోయిన్. శ్రుతి మమూలు పెర్ఫామర్ కాదు. కామెడీ టైమింగ్ డ్యాన్స్ ల్లో మేటి.. అని ప్రశంసించారు. శ్రుతి ఐ లవ్ యు (సోదర ప్రేమ) అంటూ తన అభిమానాన్ని కురిపించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.