అమెరికా నుండి కేన్స్ వెళుతున్నా.. వావ్

Update: 2017-05-17 09:51 GMT

అదేంటో తెలియదు కాని.. కేన్స్ చలనచిత్రోత్సవంలో జస్ట్ కనిపిస్తే చాలు.. మన తారలు చాలా ఎక్సయిట్ అయిపోతారు. ఈ ఏడాది తొలిసారిగా అక్కడి రెడ్ కార్పెట్ పై నడిచిన తన కొత్త సినిమాను లాంచ్ చేసుకోవడానికి వెళుతోంది సోకులాడి శృతి హాసన్. ప్రస్తుతం లాస్ ఏంజెలిస్ లో హాలిడేయింగ్ చేస్తున్న ఈ కాటమరాయుడి బ్యూటి.. ఇప్పుడు గాల్లో తేలిపోతోంది అంతే.

భారత్ లో అతి పెద్ద బడ్జెట్ లో నిర్మించిన సినిమా బాహుబలి. ప్రపంచ ప్రేక్షకులు తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. బాహుబలి వేసిన దారిలో ఇప్పుడు మన ప్రాంతీయ సినిమాలు నెమ్మదిగా అంతటి స్థాయి సినిమాతీయటానికి ప్రయత్నాలు మొదలెట్టాయి. అలాంటి సినిమాయే సంఘమిత్ర. శృతి హాసన్ జయం రవి  ఆర్య ప్రధాన పాత్రలు గా సుందర్ సి డైరక్షన్లో ఈ సినిమా నిర్మించడానికి అన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కేన్స్  ఫిల్మ్ ఫెస్టివల్ లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అందుకే శృతి అంత ఎక్సయిట్ అయ్యింది.

ఇకపోతే ఈ ఏడాది కూడా ఐశ్వర్య రాయ్.. సోనప్ కపూర్.. యామి జాక్సన్ వంటి భామలు కేన్స్ రెడ్ కార్పెట్ పై రచ్చ చేయనున్నారు. ఎవరెవరు తమ సోకులతో ఎలా అందరినీ పడేస్తారో చూడాలంటే.. మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News