సౌత్ బ్యూటీ శృతి హాసన్ కు యాక్టర్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు పాటలు పాడ్డం కొంత తగ్గించింది కానీ.. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగానే పాడేది. అసలు సింగర్ గా ఈమె ప్రస్థానం 6ఏళ్ల వయసులోనే మొదలైందంటే ఆశ్చర్యం వేయక మానదు.
క్షత్రియపుత్రుడు మూవీలో ఓ పాట పాడింది శృతి హాసన్. అప్పుడామె వయసు కేవలం ఆరేళ్లు. అంత చిన్న వయసులోనే సంగీత స్వరాలను అంత రాగయుక్తంగా పాడ్డం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇలా పాడగలగడానికి చిన్నప్పటి నుంచి లభించిన ప్రోత్సాహమే కారణం అంటుంది శృతి హాసన్. 'చిన్నపుడు ఇంట్లో కూనిరాగాలు తీసేదాన్నని అమ్మ చెప్పేది. అమ్మకి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే నన్ను ప్రోత్సహించింది. దీంతో నా ప్రపంచం సంగీతమే అయిపోయింది' అని చెబ్తోంది శృతి హాసన్.
'కాలేజ్ చదువులకు వచ్చాక కూడా సంగీతంపై మనసు పోలేదు. క్లాస్ లో మనిషిని ఉన్నా.. మనసంతా మ్యూజిక్ పైనే నిలిచేది. అందుకే చదువు మానేసి మరీ సంగీతాన్నే కెరీర్ గా మార్చుకున్నాను. ఇప్పుడు యాక్టర్ గా అనుకోకుండా మారినా.. సంగీతం - నటన నాకు రెండు కళ్లులా అయిపోయాయి' అని చెబ్తోంది శృతి హాసన్.