శ్రుతిహాసన్ ఆల్ రౌండర్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. నటిగా గాయనిగా.. రైటర్ గా ఆల్ రౌండర్ ప్రతిభతో ఆకట్టుకుంటోంది. ఇటీవల అనేక అంతర్జాతీయ కచేరీల లో గాయనిగా ప్రదర్శన ఇచ్చింది. ఇప్పటికీ ఆ వృత్తిని ఎంతో ప్రేమగా కొనసాగిస్తోంది. ఇక ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ పరంగానూ ఎవ్వర్ లేటెస్ట్ స్టైల్స్ ని అనుసరించడం తన పద్ధతి. సౌత్ బెస్ట్ ఫ్యాషనిస్టా గానూ శ్రుతి గుర్తింపును దక్కించుకుంది.
ఇటీవలే `లాభం` చిత్రీకరణ సమయంలో ముంబైలోని ఓ ఫుడ్ కోర్ట్ నుండి బయటకు వస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. పింక్ టీ-షర్టులో శ్రుతి అల్ట్రా స్టైలిష్ గా కనిపించింది. నడుము పైకి తేలిన బ్లాక్ హై డెనిమ్స్ .. మ్యాచింగ్ బూట్లతో మైమరిపించింది. బ్లాక్ షేడెడ్ గాగుల్స్ ను కళ్లకు ధరించి పోష్ స్టైల్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోల్ని అభిమానులు అంతర్జాలంలో వైరల్ గా షేర్ చేస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే.. శ్రుతి హాసన్ ప్రస్తుతం లాభం అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఇందులో విజయ్ సేతుపతి సరసన నాయికగా నటించింది. ఇటీవలే శ్రుతి .. యానిమేటెడ్ హాలీవుడ్ చిత్రం ఫ్రోజెన్ 2 తమిళ వెర్షన్ లో ఎల్సా పాత్రకు తన వాయిస్ ని వినిపించింది. శ్రుతి గత సంవత్సరం ట్రెడ్ స్టోన్ అనే మొట్ట మొదటి అంతర్జాతీయ సిరీస్ లో అవకాశం దక్కించుకుంది. యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో నీరా పటేల్ అనే భారతీయ మూలాలున్న కిల్లర్ గా నటించి ఆకట్టుకుంది.