ఫోటో స్టొరీ: శృతి ఈజ్ బ్యాక్!

Update: 2019-06-04 04:28 GMT
శృతి హాసన్ ఈజ్ బ్యాక్.  ఈ విషయం అందరికీ తెలిసిందే.  లండన్లో సింగర్ గా తన సత్తా చాటుతానని సినిమాలకు దూరంగా వెళ్ళినప్పటికీ అక్కడ పెద్దగా విజయం సాధించకపోవడంతో మళ్ళీ తనకు అచ్చొచ్చిన సినిమాల్లోకే రీ ఎంట్రీ ఇచ్చింది.  ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతితో 'లాబం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఒక్కటే కాకుండా మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే శృతి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమయంలో కాస్త బరువు పెరిగింది. మునుపటిలాగా స్లిమ్ లుక్ లో లేదని విమర్శలు వచ్చాయి.   మరి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుందేమో కానీ లుక్ మార్చేసింది.

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా శృతి ఓ మూడు ఫోటోలను షేర్ చేసింది.  ఈ ఫోటోలలో గ్రే కలర్ టాప్.. బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించిన శృతి ఎంతో స్టైలిష్ గా పొజిచ్చింది.  ఈ ఫోటోలలో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆమె వేసుకున్న ప్యాంట్.. షర్ట్.. గుచి బెల్టు కాదు.  ఆమె యాబ్స్.  అదే జెంట్స్ కైతే సిక్స్ ప్యాక్ అని.. ఎయిట్ ప్యాక్ అని హంగామా చేస్తుంటారు. కానీ అందమైన భామల విషయం వచ్చేసరికి అలా ఉండదు. ఫ్లాట్ గా ఉండే యాబ్స్ అంటే ఫిట్నెస్ పీక్స్ అనే అభిప్రాయం ఉంది.  శృతి ఎడాపెడా ఎక్సర్ సైజులు చేస్తోంది.. పక్కాగా డైట్ మెయింటెయిన్ చేస్తోంది. లేకపోతే అంత ఫిట్ గా ఎలా తయారవుతుంది? ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది.  శృతి ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఈ సారి సినిమాల సంగతి తాడో పేడో తేల్చేందుకే కంకణం కట్టుకున్నట్టుంది. మరి శృతి సైడ్ నుంచి ప్రయత్నాలు ఓకే.. ఫిలిం మేకర్లు కూడా మంచి ఆఫర్లు ఇచ్చి శృతిని ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.


Tags:    

Similar News