హీరోయిన్ శృతిహాసన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇంతకాలం దాచిపెట్టిన అందాలన్నీ ఇప్పుడు రోజుకొకటి చొప్పున విందు అభిమానుల ముందు పెడుతుంది. ఇటీవలే వెడ్డింగ్ లుక్ డిజైన్ పోస్ట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ.. హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయినుగా ఎదిగింది శృతి. అమ్మడు కాటమరాయుడు సినిమా తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. ఆ మధ్య రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ సినిమాల పై దృష్టి పెట్టింది ముద్దుగుమ్మ. నిజానికి సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం.. తమిళం, హిందీలో ఒక్కో సినిమాలు చేస్తుంది.
అలాగే తెలుగులో రవితేజ - గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్‌గా శృతి నటిస్తుంది. అంతేగాక తాజాగా శృతి అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ “టెడ్‌స్టోన్”లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌గా రూపొందనున్న ఈ “ట్రెడ్ స్టోన్”ని రామిన్ బహ్రానీ తెరకెక్కించనున్నారు. ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూ రహస్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం. ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ లో అమ్మడు మరో వెడ్డింగ్ వౌస్ లుక్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శృతి టోటల్ బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ధరించింది. ఆమె నుదుటిన బొట్టు దగ్గర నుండి డ్రెస్, నెయిల్ పెయింట్ వరకు అన్నీ బ్లాక్ కలర్ లోనే ముస్తాబు చేసుకుంది. ఇందులో పద్ధతిగా కనిపించే ఓ భారతీయ మహిళ లుక్ ప్రతిబింబిస్తుంది శృతి. విశేషం ఏంటంటే.. ఆ అందమైన ఫోటోకి ఫోటోగ్రాఫర్ కూడా శృతినే. గబ్బర్ సింగ్ భాగ్యలక్ష్మిలా చుడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.