యుద్దాల్లో ముద్దొస్తున్న శృతి!!

Update: 2017-04-19 11:26 GMT
బాహుబలిని అర్జెంటుగా కొట్టేయాలి. రికార్డులు రివార్డులూ పట్టేయాలి. ఇలాంటి స్కెచ్చులు వేసుకుని తమిళనాటి నుండి చాలామంది బయలుదేరారు. సింపుల్ గా పులి అంటూ కొట్టేద్దామని విజయ్ అనుకున్నాడు. కాని బాహుబలిని కొట్టేయడం అంత వీజీ కాదు గురూ అని జనాలు చెప్పకనే చెప్పారు. అయితే ఇప్పుడు ఖుష్బూ మొగుడు సి.సుందర్ కూడా ''సంఘమిత్ర'' అనే పేరుతో సినిమాతీసి బాహుబలిని కొట్టేద్దాం అనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో పాటు భారీ క్యాస్టింగ్ కూడా దించేస్తున్నాడు. ఇక మెయిన్ లీడ్ గా శృతి హాసన్ నటిస్తోంది.

గత కొన్ని రోజులుగా లండన్ లో పొద్దున్నే లేచి కత్తియుద్దాలు ప్రాక్టీస్ చేస్తోంది హీరోయిన్ శృతి హాసన్. ఈ సినిమాలో కత్తియుద్దాలు చేయాలి కాబట్టి.. ఒక ఫారిన్ ట్రైనర్ ను పెట్టుకుని అమ్మడు స్వార్డ్ ఫైటింగులో శిక్షణ పొందుతోంది. చాలారోజుల నుండి ఈ యుద్దం నేర్చుకోవాలని ఉన్నా కూడా.. ఫైనల్ గా ఇప్పటికి నేర్చుకోవడం కుదిరిందని చెబుతోంది ఈ అమ్మడు. ఆల్రెడీ సోషల్ మీడియాలో శృతి కత్తియుద్దం ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు పోస్టు చేసి నానా రచ్చ చేస్తోంది. భారీ భారీ కత్తులతో భారీ వయ్యారాలతో అమ్మడు యుద్దాల్లో కూడా ముద్దొచ్చేశాలా ఉంది.

ఇకపోతే ఈ ''సంఘమిత్ర'' సినిమాతోనైనా తమిళవారు బాహుబలిని బీట్ చేస్తారా? ఈ సినిమాలో జయం రవి.. ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News