సితార శ్రుతిల‌య‌లు

Update: 2015-12-09 04:51 GMT
ఇక్క‌డ శ్రుతిని చూస్తుంటే చీర‌కే నిండుద‌నం వ‌చ్చిన‌ట్టు లేదూ! అవును మ‌రీ...  శ్రుతిలాంటి మెరుపుతీగ ఏం డ్రెస్సు వేసినా అదుర్స్ అనిపించేంత అందంగా క‌నిపిస్తుంటుంది. ఇక మ‌న భార‌తీయ సంస్కృతికే ఓ చిహ్న‌మైన చీర క‌డితే ఆ అందం రెట్టింప‌వ‌దూ. ఇంత‌కీ ఈ గెట‌ప్ ఏ చిత్రంలోనిదో తెలుసా? ప‌్రేమ‌మ్ రీమేక్ `మ‌జ్ను`లోనిది. ఈ సినిమాలో ఆమె సితార అనే పాత్ర‌లో న‌టిస్తోంది. అదొక టీచ‌ర్ పాత్ర అట‌. యంగ్ అండ్ డైన‌మిక్ టీచ‌ర్ అన్న‌మాట‌.

శ్రుతి ఎంతో ప్రేమించి చేస్తున్న పాత్ర అది. అందుకే ఈ గెట‌ప్ కూడా అంతగా కుదిరింది. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌జ్ను విశాఖ‌ప‌ట్నంలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ణ జ‌రుపుకుంటోంది. ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్‌ - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - రెజీనా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. వ‌చ్చే యేడాది మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 
Tags:    

Similar News