శృతి ప్రేమ నిజమేనంటారా?

Update: 2017-08-02 05:48 GMT
సౌత్ బ్యూటీ శృతి హాసన్ కి బాగా డేరింగ్ ఎక్కువే. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పేసే ఈ భామ ఎందుకో గానీ.. తన ప్రేమ వ్యవహారాన్ని మాత్రం సైలెంట్ గానే కంటిన్యూ చేస్తోంది. బ్రిటన్ కు చెందిన మైకేల్ కోర్సలేతో శృతి ప్రేమలో ఉందంటూ కథనాలు చాలా కాలంగానే ఉన్నాయి. అంతే కాదు.. వీరి ప్రేమకు తండ్రి కమల్ హాసన్ నుంచి అనుమతులు కూడా ఉన్నాయని.. ఇప్పటికే ఓసారి కమల్-మైకేల్ లు లండన్ లో భేటీ అయ్యారనే టాక్ కూడా ఉంది.

ఇన్ని ప్రేమ కబుర్లు వినిపిస్తున్నా శృతి హాసన్ మాత్రం ఇప్పటివరకూ ఈ విషయంపై ఓపెన్ అవలేదు. తనంతట తాను చెప్పకపోవడమే కాదు.. ఎవరైనా అడిగినా సరే మాట దాటేస్తోంది. పైగా తనకు ఈ విషయంపై ప్రశ్నలు ఎదురైతే.. మిన్నకుండిపోతోంది. ఈ బ్యూటీ తాను నటించిన బాలీవుడ్ మూవీ రాగ్ దేష్ ప్రచారంలో తెగ బిజీగా గడిపేస్తోన్న శృతి హాసన్ కు.. ఇప్పుడు ఇదే విషయంపై ప్రశ్నలు ఎదురైతే.. 'సారీ.. దాని గురించి అయితే మాట్లాడదలచుకోలేదు' అని నిర్మొహమాటంగా తేల్చేసింది. అలాగని మైకేల్ కోర్సలేకు దూరంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే.

ఇటు ముంబై.. అటు చెన్నైల మధ్య చక్కర్లు కొడుతున్న శృతి హాసన్.. పలు మార్లు ముంబై ఎయిర్ పోర్టులో మైకేల్ తో కలిసి కనిపించింది. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు ఈమెను మైకేల్ తో కలిపి ఫోటోలు తీస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు శృతి. ఇంతకీ శృతి తన ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకున్నట్లే అంటారా?
Tags:    

Similar News