పేరులో ఏముంది.. ఆరడుగుల అందగాడికి నేముతో పనేముంది ? అని ఓ తెలుగు సినిమా హీరోయిన్ అంటుంది. ఇలాంటివన్నీ ఇంతకు ముందు బాగానే చెల్లుబాటు అయ్యేవి. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం పేరు మార్చడం కాదు.. కనీసం స్పెల్లింగ్ తప్పు రాసినా దులిపేస్తున్నారు. కొందరు డైరెక్టుగాను, మరికొందరు ఇన్ డైరెక్టు గాను, ఇంకొందరు వెటకారాలతోను తమ కోపాన్ని కక్కేస్తున్నారు.
సౌత్ బ్యూటీ శృతి హాసన్ ఈ పేర్ల గొడవలోకి చేరింది. "నా పేరును అందరూ కరెక్ట్ గా రాయాలని కోరుకుంటున్నా. నాపేరు స్పెల్లింగ్ శృతి హాసన్.. అంతే కానీ శ్రితి. .శ్త్రుది.. శ్రూతి హస్సన్ లేదా శృథి హుస్సేన్ కాదు.." అంటూ ట్విట్టర్ లో ఘాటైన ట్వీట్ ఒకటి పెట్టింది. పేరు విషయంలో పద్దతిగా రాయాలని చాలామంది చెప్పారు కానీ.. ఇలా డైరెక్టుగా ఇన్ని పేర్లతో ట్వీట్ పెట్టి మరీ వెటకారం ఆడింది మాత్రం శృతి హాసన్ ఒక్కతే. ఈ భామలు తమ పేరును తాము ప్రేమించుకోవడంతోపాటు.. ఇక్కడ న్యూమరాలజీ లెక్కలు కూడా తేడా వస్తున్నాయ్. అందుకే ఈ రాద్ధాంతమంతా. ఇలా పేరు విషయంలో గొడవ చేసిన హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.
తన పేరు చివర ఓ హెచ్ అక్షరాన్ని తగిలించుకున్న తమన్నా.. స్పెల్లింగ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే సమంత పేరును.. ఓసారి సమ్నత అని స్పెల్ చేస్తే.. ఆవిడెవరు, కొత్త హీరోయినా అని ట్వీటింది సమంత. నా మిడిల్ నేమ్ ప్రీత్ అంతే కాని ప్రీతి కాదు అని రకుల్ ప్రీత్ సింగ్ కూడా ట్వీట్ చేసింది. గతంలో హీరోయిన్లు పేరు తెచ్చుకోవడం పోరాడేవారు.. ఇప్పుడు పేరులో స్పెల్లింగ్ కోసం పోరాడుతున్నారు. ఏంటో... 21 ఫస్ట్ సెంచరీ హీరోయిన్ల తీరు.