కావాలనే గ్యాప్ తీసుకున్నానన్న పవన్ హీరొయిన్

Update: 2019-04-28 05:26 GMT
లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా హింది సినిమా లక్ తో పరిచయమై డెబ్యుతోనే డిజాస్టర్ అందుకున్నప్పటికి సరైన సమయం కోసం వేచి చూసిన శృతి హాసన్ ఆ తర్వాత తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ వైపు దూసుకుపోయింది. పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ తన రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది. మహేష్ బాబు-రవితేజ-అజిత్-సూర్య లాంటి స్టార్లు కోరిమరీ తీసుకునే రేంజ్ కి ఎదిగింది.

అయితే పవన్ తోనే చేసిన కాటమరాయుడు తర్వాత శృతి హాసన్ పెద్ద బ్రేకే తీసుకుంది. హిందిలో ఒక ఫ్లాప్ మూవీ చేశాక ఆపై దర్శనమే లేదు. దాని గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించింది శృతి హాసన్
తనకు అవకాశాలు తగ్గలేదని కేవలం విభిన్న రంగాల్లో తన టాలెంట్ ను ఋజువు చేసుకునేందుకే గ్యాప్ తీసుకున్నాను తప్ప వేరే కారణం లేదని క్లారిటీ ఇచ్చింది.

ఇంకొకరి మీద ఆర్థికంగా ఆధారపడటాన్ని తానెప్పుడు ఇష్టపడనని సంగీతమే ప్రపంచంగా బ్రతికే తనకు ఎక్కడైనా రాణించగలననే నమ్మకం ఉందని గట్టిగా చెబుతోంది. గత కొద్దిరోజులుగా మైకేల్ కర్సోల్ తో తన లవ్ బ్రేకప్ గురించి నేరుగా చెప్పడానికి ఇష్టపడని శృతి ఇందులో మాత్రం పాత పాటే పాడుతోంది.

ఇప్పుడీ గ్యాప్ తర్వాత విజయ్ సేతుపతి సినిమా కోసం మేకప్ వేసుకున్న శృతి హాసన్ కు కొరటాల శివ-చిరంజీవి కాంబో ప్రాజెక్ట్ లో హీరొయిన్ గా ప్రతిపాదన ఉన్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు
Tags:    

Similar News