ట్వీటేసి శృతి ఏం మెసేజ్ ఇద్దామని?

Update: 2017-06-24 09:44 GMT
సెక్సీ బ్యూటి శృతి హాసన్.. దాదాపు అన్ని ఫిలిం ఇండస్ర్టీల్లోనూ ఇప్పుడు మరోసారి ఫ్లాపులు కొట్టేసింది. తెలుగులో కాటమరాయుడు.. బాలీవుడ్ లో బెహన్ హోగీ తెరీ.. తమిళంలో పులి.. ఇలా ఈ మధ్యన అమ్మడికి అన్నీ ఫ్లాపులే తగిలేశాయి. ఈ క్రమంలో అమ్మడు కొన్ని సినిమాలను కూడా వదులుకుంది. వాటిలో భారీ బడ్జటె తమిళ బాహుబలి అయిన 'సంఘమిత్ర' కూడా ఉందనే సంగతి తెలిసిందే.

ఈ మధ్యనే సంఘమిత్ర సినిమా నుండి తప్పుకుని షాకిచ్చిన శృతి హాసన్ ఇప్పుడు ఆ సినిమా గురించి రకరకాలు న్యూసులు  పంచుకుంటూ షాకిస్తోంది. సంఘమిత్రను రూపొందిస్తున్న శ్రీ తేండాల్ ఫిలింస్ వారు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. శృతితో ఎటువంటి గొడవలూ లేవని.. ప్రొఫెషనల్ కమిట్మెంట్ కారణంగానే రెండు వర్గాలు చర్చించుకుని పరస్పర అంగీకారంతోనే ఆమె ఈ సినిమా నుండి తప్పుకుందని ప్రకటించారు. ఆ పాత్రలో నయనతారను అనుకున్నాం కాని.. ఇప్పుడు వేరే అమ్మాయిని ఫైనల్ చేశామని.. త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని కూడా తెలిపారు. ఈ వార్తను ఇప్పుడు శృతి రీట్వీట్ చేసి మరి అందరికీ చాటింపేస్తోంది. ఏం మెసేజ్ ఇద్దామని ఈ చాటింపులు శృతి?

నిజానికి ఇంత పెద్ద సినిమా నుండి శృతి హాసన్ లాంచింగ్ తరువాత తప్పుకుందంటే.. దానికి ఏదో పెద్ద రీజన్ ఉండి తీరాల్సిందే. కేవలం ప్రొఫెషనల్ కమిట్మెంట్ల దృష్ట్యా తప్పుకుందంటే మాత్రం నమ్మలేం. కాని శృతి మాత్రం ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తోంది. సర్లేండి.. హిట్టొచ్చే కమర్షియల్ సినిమాలేమైనా ఆమె ఖాతాలో పడతాయని ఆశిద్దాం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News