మత్తెక్కించే క్రాక్ బ్యూటీ సెల్ఫీ అందాలు..!

Update: 2021-04-24 03:30 GMT
సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సాలిడ్ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అయితే శృతి అదృష్టం ఎలా ఉందంటే.. మూడేళ్లు విరామం తర్వాత క్రాక్ సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. ఇంకా ఫామ్ లోనే ఉన్నానంటూ గుర్తుచేస్తూ అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం సలార్ తో పాటుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన లాభమ్ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన లాభమ్ టీజర్ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసాయి. ఈ సినిమాలో శృతి జానపద గాయనిగా కనిపించనుంది.

ఇదిలా ఉండగా.. శృతి సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ తో కుర్రకారును అల్లాడిస్తుంది. ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేసే శృతి.. తాజాగా ఓ స్పెషల్ పిక్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శృతి సెల్ఫీ అందాలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయని చెప్పాలి. మరి అమ్మడి సెల్ఫీలో అంతలా అందాలు దాగున్నాయని అంటున్నారు ఫ్యాన్స్. బ్లూ డెనిమ్ జీన్స్ ధరించిన శృతి బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ తో కొంటెగా కెమెరా వైపు లుక్కిచ్చింది. ఆ వాలు కళ్లు చూసైనా కుర్రాళ్ళు పడిపోవాల్సిందే. ఈ ఏడాది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శృతి.. ఇప్పిడిప్పుడే మళ్లీ లవ్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతోందని టాక్ నడుస్తుంది. చూడాలి మరి త్వరలో మరో తీపికబురు చెబుతుందేమో.. ప్రస్తుతం వయ్యారి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
Tags:    

Similar News