పాప్ స్టార్ కాలేక చివ‌రికిలా అయిన స్టార్ డాట‌ర్

Update: 2021-03-01 23:30 GMT
టాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా ఎదిగాక అనూహ్యంగా విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్స‌లేతో ప్రేమాయ‌ణం వ‌ల్ల పూర్తిగా సినిమాల‌కు దూర‌మైంది శ్రుతిహాస‌న్. కానీ ఆ ప్రేమకు అనూహ్యంగా బ్రేకులు ప‌డ్డాయి. అనంత‌రం ఆ ఒత్తిడి  డైల‌మా నుంచి కోలుకునేందుకు శ్రుతికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఇప్పుడు శంత‌ను హజారికా అనే కొత్త బోయ్ ఫ్రెండ్ తో శ్రుతి స్నేహం మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇదిలా ఉంటే .. శ్రుతి యాటిట్యూడ్ గురించి యువ‌త‌రంలో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఈ భామ‌కు తొలి నుంచి పాప్ స్టార్ అవ్వాల‌న్న కోరిక అలానే మిగిలిపోయింది. తాను అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టీ.. దీనివ‌ల్ల గొప్ప వెస్ట్ర‌న్ స్టైల్ గాయ‌నిగా వెల‌గాల‌న్న త‌న త‌ప‌న నెర‌వేర్చుకోలేక‌పోయింది. ఈలోగానే ల‌వ్ లైఫ్ లో ర‌క‌ర‌కాల క‌ల‌తలు ఇబ్బంది క‌రంగా మారాయి. అయితే శ్రుతి బాడీ లాంగ్వేజ్ నుంచి పాశ్చాత్య ధోర‌ణి మాత్రం బ‌య‌ట‌కు వెళ్ల‌లేదు.

ఇదిగో ఇలా నాభికి కుట్లు వేయించుకోవ‌డం.. ఒంటిపై కొన్ని ప్రయివేటు భాగాల‌పై టాట్టూల్ని వేయించుకోవ‌డం వ‌గైరా హ్యాబిట్స్ ని వ‌దిలి పెట్ట‌లేక‌పోతోంద‌ట‌. ఇంత‌కుముందు మైఖేల్ కోర్స‌లే టాట్టూ ప్రియుడే. ఇప్పుడు పాపం ప‌సోడు శంత‌ను హ‌జారికా కూడా టాట్టూల ప్రియుడే. వీళ్లంద‌రినీ మించి శ్రుతి టాట్టూల ప్రేయ‌సి. పైగా ప్ర‌ముఖ‌ పాప్ స్టార్ ల‌ను ఇమ్మిటేట్ చేయ‌డం ప్ర‌తిసారీ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. తాజాగా శ్రుతి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. బ్లూ డెనిమ్ టాప్ డెనిమ్ బాట‌మ్ తో స్పెష‌ల్ గా క‌నిపించింది. ఇక ఆ టాప్ లో డెనిమ్ ఇన్న‌ర్ పై ఏదో బ్రాండ్ కి సంబంధించిన లోగో క‌నిపిస్తోంది. క్రాక్ తో అదిరే కంబ్యాక్ సాధ్య‌మైంది. త‌దుప‌రి శ్రుతి న‌టించిన వ‌కీల్ సాబ్ రిలీజ్ కానుంది.
Tags:    

Similar News