అభిమానులు నిజంగా గొప్పవారు. తమకు ఏ రక్త సంబంధం లేని వెండి తెర వేలుపులను గుండెల్లో కొలువుంచి సదా పూజలు చేస్తారు. వారిది మూఢమైన ప్రేమ. ఎంతలా అంటే ఒక్కోసారి తమ దేవుళ్ళు దేవతలను కూడా నిందాపూర్వకంగా దూషించే స్థితికి వెళ్లిపోతారు. అయితే అందులో భక్తినే చూడాలి. ఇక అభిమానం అన్నది ఎంత డబ్బు ఇచ్చినా దొరకదు, దాన్ని వేరే విధంగా అందుకోవడం కష్టం. ఒక హీరోకు విరగబడి అభిమానులు ఉంటారు, ఎందుకు అంటే దానికి సమాధానం ఉండదు, ఏ లాజిక్ కి అందని ప్రేమ అది.
అటువంటి అభిమానుల మీద కూడా వ్యతిరేకంగా కామెంట్స్ వస్తూంటాయి. కొందరు గిట్టని వారు సైకో ఫ్యాన్స్ అంటూంటారు. లేక పిచ్చి వాళ్ళు అని కూడా తూలనాడతారు. మీ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసుకోలేరా అని హీరోలను కూడా ఇండైరెక్ట్ గా విమర్శిస్తూంటారు. అయితే ఇక్కడ అంతా అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యాన్స్ అన్న వారు తమ నియంత్రణను దాటి మరీ తాము, హీరో వేరు అన్న ద్వైదీ భావనను కూడా దాటేసి అదొక రకమైన తన్మయత్వ స్థితికి ఏనాడో వెళ్ళిపోయిన వారు. అందువల్ల వారు ఒకరి కంట్రోల్ లో ఉంటారు, ఉండాలి అనుకోవడం భ్రమ మాత్రమే.
ఇక ఫ్యాన్స్ గురించి వెండి తెర వేలుపుల ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మా ఫ్యాన్స్ బుద్ధిగా ఉండాలి. మా సినిమాలను చూసి సక్సెస్ చేయాలి. మాకు మంచి పేరు తేవాలి. ఇలా సాగుతాయి. అయితే ఈ ఫ్యాన్స్ తమ హీరో లేక హీరోయిన్స్ ని పూర్తిగా సొంతం చేసేసుకుని వారిని తమలో ఆవహింపచేసుకుని కొన్ని సార్లు స్వీయ విషయాల్లో కూడా ఎక్కువగా రియాక్ట్ అయిపోతారు.
అదే సమయంలో వారు తమ హీరోకు కాస్తా నొప్పి తగిలింది అనుకుంటే దానికి కారకులు అని తాము అనుకునే వారి మీద వేరే లెవెల్ లో ఆగ్రహం కూడా చూపించేస్తారు. అపుడు ఈ ఫ్యాన్స్ అలా టార్గెట్ అయిన వారికి నిజంగా ఇబ్బందినే కలిగిస్తారు. అయితే వారి మూఢ భక్తిలో దీన్ని గ్రహించకపోయినా అవతల వారికి మాత్రం నిజంగా చచ్చేటంత బాధే.
ఇదిలా ఉంటే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ సమంత నాగ చైతన్య విడిపోయిన సంగతి విధితమే. ఇక సమంత సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన వ్యూయర్ షిప్ తో తన ఖాతాలను రన్ చేస్తోంది. ఒకనాడు సోషల్ మీడియాలో పెద్దగా ట్రోల్స్ ఆమెకు లేవు. కానీ విడాకుల తరువాత మాత్రం ఆమె ఈ రకంగా ఇబ్బంది పడుతోంది.
అయితే దీని మీద మరో నటుడు సిద్ధార్ధ్ అయితే తన అభిప్రాయంగానే ట్విట్టర్ లో కొన్ని రాసుకొచ్చాడు. కొందరు తమ గిరాకీ కోసం చేస్తున్న హంగామా వల్లనే ఈ రకమైన ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు అంటూ ఇండైరెక్ట్ గా సమంతకు తాకేలా హాట్ కామెంట్స్
చేశారు. డబ్బులు పెట్టి ప్రేమను కొనుక్కోవాలని చూస్తే ద్వేషం కూడా అలా వచ్చేస్తుంది అన్నట్లుగా సిద్ధార్ధ్ పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చింది ఫ్యాన్స్ గ్రూప్ ని మెయింటెయిన్ చేయడం వల్ల ప్రేమ మాత్రమే రాదు, ఒక్కోసారి ద్వేషం కూడా చిమ్మబడుతుంది అని ఆయన ఎత్తి చూపారు. అలాంటి అభిమానం చివరికి కాటు కూడా వేస్తుందని హెచ్చరించారు.
మొత్తానికి సిద్ధార్ధ్ చాలా కాలంగా బయటకు చెప్పకుండానే సమంత కి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేస్తున్నారు అన్న ప్రచారం ఉంది. ఇలా లేటెస్ట్ గా ఆయన సమంత ట్వీట్ల మీద రియాక్ట్ కావడం మీద కూడా చర్చ అయితే హాట్ గానే సాగుతోంది. అయితే ఆయన మొదట చెప్పినది బాగానే ఉన్న అభిమానులు కాటు వేస్తారు అని సెటైర్లు వేయడం మాత్రం బాగోలేదు అన్న వారు ఉన్నారు. అభిమానులు నిస్వార్ధంగా ఉంటారు. ఇక ట్విట్టర్ లో ఉన్న వారు అంతా అభిమానులు కావాల్సిన అవసరం లేదు, ప్రతీ సిటిజన్ అభిమాని ఎలా కాడో అలాగే నెటిజన్ కూడా కాడు.
ఇక వారి అభిప్రాయాన్ని వారు చెబుతారు, కొందరు అయితే బ్లంట్ గా కూడా తమ కామెంట్స్ పెడతారు. అన్నీ ఓర్చుకుంటెనే సోషల్ మీడియా ఖాతాలు ఎవరైనా మెయింటెయిన్ చేయగలారు. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే అభిమానులు ఎపుడూ కాటు వేయరు, ప్రేమను మాత్రమే పంచగలరు అని మాత్రమే. అయితే తమ వాడు, దేవుడు అనుకున్న హీరో బాధపడుతున్నారు అంటే ఆయన తరఫున మాట్లాడే వారు కూడా ఉండొచ్చు. అంత మాత్రం చేత వారు చేదుగా నిజాలు చెబితే కాటు వేశారు అనుకోవడం సిద్ధార్ధ్ లాంటి వారికి కూడా తగదని అంటున్నారు.