స్టూడెంట్ నెం.1 సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైన రాజమౌళి ఇప్పుడు బాహుబలి సినిమాతో ప్రపంచం అంతటికీ తెలిసిపోయాడు. ఈ సినిమా 200 కోట్ల క్లబ్బులోకి చొచ్చుకుపోవడంతో మనోడికి మరింత క్రేజ్ వచ్చేసింది. ఇకపోతే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన కుర్రాళ్ళు వరుణ్ దావన్, సిద్దార్ద్ మల్హోత్రా.. యాథృచికంగా స్టూడెంట్ అనే టైటిల్స్‌తో పరిచయమైన ఈ ముగ్గురు సెలబ్స్ మధ్యనా ఇప్పుడు ఓ లింక్ పడింది. లెటజ్ సీ.
బాహుబలి సినిమా రిలీజైన వెంటనే ఇదో అద్భుతమైన సినిమా అంటూ తొలి షో చూసిన సిద్దార్ద్ మల్హోత్రా కామెంట్లు చేశాడు. వెంటనే ట్విట్టర్లో సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీటేశాడు. ఇక మనోడు కరణ్ జోహార్ శిష్యుడు కాబట్టి, రాజమౌళి అతగాడికి రిప్లయ్ ఇవ్వక తప్పలేదు. ఇక రాజమౌళి రిప్లయ్ ఇవ్వడం ఆలస్యం.. సిద్దార్ధ్ ఫుల్‌గా ఎక్సయిటైపోయి ఇంకా కాకా పట్టేస్తున్నాడు. సేమ్ టు సేమ్ వరుణ్ దావన్ కూడా. మనోడు కూడా బాహుబలి గురించి బాలీవుడ్ మీడియాలో భారీ కామెంట్లు చేస్తూ నానా హంగామా చేస్తున్నాడు. ఏకంగా మీడియాలో కూడా అనే బైట్లు ఇచ్చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది?
సప్పోజు.. ఫర్సప్పోజు.. రాజమౌళి కనుక బాలీవుడ్లో సినిమా చేస్తే.. ఎలాగో అది కరణ్ జోహార్ ప్రొడక్షన్లోనే చేస్తానని చెప్పాడు కాబట్టి, ఈ ఇద్దరు హీరోలూ మనోడ్ని కాకా పట్టేస్తే హ్యాపీగా బాహుబలి మేకర్ డైరక్షన్లో వచ్చే తొలి హిందీ సినిమాలో పార్టయ్యే ఛాన్సుంటుంది. అంతే కదూ మరి. బాలీవుడ్ స్టయిలే ఇది.