సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన `మిషన్ మజ్ను` చిత్రంతో బాలీవుడ్ లో రష్మిక మందన్న అరంగేట్రం చేయవలసి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమైంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన గుడ్ బై చిత్రం మొదట విడుదల కాగా.. మిషన్ మజ్ను ఓటీటీ రిలీజ్ కి డేట్ లాక్ అయింది. కొత్త ఆన్-స్క్రీన్ జంట తాజాగా ఓ ఇంటరాక్షన్ లో ఈ విషయాలన్నిటిపైనా సరదాగా ముచ్చటించారు.
మిషన్ మజ్ను గురించి రష్మిక మందనను ప్రశ్నించగా.. సాంకేతికంగా మొదట చిత్రీకరించినది మిషన్ మజ్ను. ఇది (మిషన్ మజ్ను) నాకు సౌకర్యమైనది. ఇది నా ఇల్లు.. నా మొదటి హిందీ ప్రొడక్షన్. ఆరంగేట్రం చాలా భయాందోళనలకు గురవుతామనేది మీకూ తెలుసు. ఏమవుతుందోనన్న టెన్షన్ ఉండేది`` అని రష్మిక చారెడేసి కళ్లతో చకచకా చెప్పేస్తుంటే మధ్యలో అడ్డుపడిన సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ అన్నీ కుదిరాక కియారా అద్వానీతో ఈ విషయాన్ని చెబుతాను!! అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించాడు. రష్మిక ప్రక్కన కూర్చున్న సిద్ధార్థ్ ఆమె స్పందనకు చిరునవ్వు నవ్వాడు.
వెంటనే రష్మిక అన్నీ అబద్ధాలు చెబుతోందని బాలీవుడ్ లో దర్శకనిర్మాతలకు ఓకే చెబుతూ ఇక్కడ ఎందుకు షూటింగ్ చేస్తున్నావు. అదే సమయంలో సౌత్ లో ఎలా షూటింగ్ చేస్తున్నావు..? అదంతా భయమేనా? అని సిద్ధార్థ్ చమత్కరించాడు. రష్మిక తనను బుక్ చేసిన సిధ్ ని చిరుకోపంతో చూసింది.
ఆ తర్వాత రష్మికను సహనటిగా బాగా కుదిరిందని కీర్తించిన సిధ్.. తను చాలా తేలికగా మాట్లాడుతుందని ఏదైనా నిర్దిష్ట సన్నివేశం గురించి ముందస్తు ఆలోచనతో సెట్ కి రాదని.. చివరికి కొత్తదాన్ని ప్రయత్నించడానికి స్కోప్ కలుగుతుందని అన్నారు. కొత్త దర్శకుడు శంతను బాగ్చి కూడా దాని నుండి ప్రయోజనం పొందాడని అతను చెప్పాడు.
సిద్ధార్థ్ - రష్మిక ఇరువురూ మిషన్ మజ్నులో నిజ జీవిత పాత్రలు పోషించారు. వాటి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. సిద్ధార్థ్ ఆర్మీ నేపథ్యం నుండి వచ్చినందున అతడు ఒక అధికారిగా ఎలా సరిగ్గా సరిపోతాడో మాట్లాడాడు. ఇంతలోనే రష్మిక కూడా మిషన్ మజ్ను -సీతా రామంలో తన పాత్రల మధ్య సారూప్యతలను పోల్చే ప్రయత్నం చేసింది. రెండు పాత్రలు ఎలా సరిపోలి ఉన్నాయి .. ఎలా భిన్నంగా ఉన్నాయి? అన్నది విశ్లేషించింది. గూఢచర్యం నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ `మిషన్ మజ్ను` జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.