మనమంటే ఎందుకంత లోకువ??

Update: 2018-02-13 23:30 GMT
ఇప్పుడు టాలీవుడ్ లో ఒక విషయం అర్ధంకావట్లేదు. అసలు ఈ స్టార్ హీరోయిన్లు చాలామందికి.. మన దగ్గర సినిమాలను ప్రమోట్ చేయడంలో పెద్దగా ఇంట్రస్ట్ ఎందుకు ఉండదా అని. ఇదే భామలు బాలీవుడ్ వెళితే మాత్రం.. నెలల తరబడి నానా హంగామా చేస్తుంటారు. అక్కడ ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. కాని తెలుగులోకి వచ్చేసరికి మహారాణుల రేంజులో బిహేవ్ చేస్తుంటారు. ఎందుకంటారు?

మొన్నామధ్యన బాలీవుడ్ కేవలం ఒక యాడ్ ను ప్రమోట్ చేసిన తమన్నా.. ఏకంగా నేల మీద కూర్చునుపోయి.. రణ్వీర్ సింగ్ కు ముద్దు పెట్టేసింది. ఆ విధంగా వారు ఒక నూడుల్స్ యాడ్ ను ప్రచారం చేశారు. ఆ తరువాత కాజల్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి.. రణదీప్ హుడాతో కలసి తిరగని చోటంటూ లేదు. తెలుగులో తన సినిమాకు కేవలం రెండు ప్రెస్ మీట్లకు వచ్చిన తాప్సీ.. అక్కడ మాత్రం త్వరలో రాబోయే సినిమాకు రెండు నెలల నుండి కాలేజీలూ పార్టీలూ పెళ్ళిళ్లూ అంటూ తిరుగుతోంది. సౌత్ లో నా నడుమును మాత్రమే చూశారని కామెంట్ చేస్తూనే.. అక్కడ మాత్రం చిట్టిపొట్టి బట్టలతో నానా రచ్చ చేస్తోంది. ఇక రకుల్ ప్రీత్ కూడా ఈ జాబితాలో చేరిపోవడం విచిత్రం. సడన్ గా ఇక్కడో పెద్ద ఫ్లాప్ రాగానే.. ముంబాయ్ కు మకాం మార్చేసి.. అక్కడ తన తాజా సినిమా అయ్యారిని బాగా ప్రమోట్ చేస్తోంది. ఇక్కడ కేవలం నాలుగు పె్రస్ మీట్లతో సరిపెట్టేస్తారు కాని.. అక్కడ మాత్రం పబ్లిక్ లో గెంతులు.. వద్దన్నా ముద్దులు.. కావాలనే కౌగిళింతలు.. అంటూ నానా హంగామా చేస్తున్నారు. మరి ఈ భామలు తెలుగు సినిమాల కోసం బోలెడంత డబ్బు తీసుకుంటూ కూడా ఎందుకంత చిన్నచూపు చూస్తున్నారు?

మొదట్లో అందలానికి ఎక్కించేసుకుని.. రాకుమారిల్లా ట్రీట్ చేయడం వలనే టాలీవుడ్ అంటే వారికి చిన్నచూపు అయిపోతుంది అంటున్నారు సినిమా ఇండస్ర్టీ వారు. పైగా ప్రమోషన్లు చేయాల్సిందే అంటూ ఎటువంటి స్పెషల్ ఎగ్రిమెంట్ లేకపోవడం.. అలాగే కేవలం కూర్చుని ఇంటర్యూలు ఇవ్వడం తప్పించి కాలేజీలతో పాటు వివిధ ఊళ్ళలో తిరిగి సినిమాను ప్రమోట్ చేసే సంస్కృతి టాలీవుడ్ లో లేకపోవడం.. ఈ భామల కటింగులకు అంతులేకుండా పోతోంది. ఏదేమైనా కూడా తెలుగు నిర్మాతలు కాస్త గట్టిగా తలుచుకుంటే.. ఈ భామలు ఇక్కడ కూడా సినిమాలను గట్టిగా ప్రమోట్ చేస్తారు. లేదంటే నయనతార ప్రమోషన్లకే రాదుగా.. మేం కూడా రాం అని చెప్పినా చెబుతారు. 
Tags:    

Similar News