అదే ఉంటే మేమందరం ఎలా వస్తాం?

Update: 2017-03-08 04:17 GMT

'నెపోటిజం' అనే మాట ఈ మధ్యన తెగ వినిపిస్తోంది కదూ. మొన్నామధ్యన కాఫీ విత్ కరణ్‌ షోలో ఉంగరాల జుత్తు రాణి కంగనా రనౌత్ ఉంది చూడండి.. ఆమె ఈ మాటను ప్రయోగించింది. అప్పటినుండి ఆ పదం వైరల్ అయిపోయింది. అసలు నెపోటిజం అంటే తెలుగులో బంధుప్రీతి అని అర్దం. అదేనండీ.. మన చేతిలో ఉన్న పదవులను అవకాశాలను మన చుట్టాలకే కట్టబెడుతున్నాం అనుకోండి.. దాన్నే నెపొటిజం అంటాం. మన రాజకీయాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంటుంది.

అయితే ఫిలిం ఇండస్ర్టీలో ఎక్కువగా వారసులు రంగంలోకి దిగడం మామూలే. కాని బాలీవుడ్ లో చాలామంది నిర్మాతలూ దర్శకులు తమ బంధుమిత్రులకు తప్పించి ఎవ్వరికీ అవకాశం ఇవ్వరూ అంటూ డైరక్టుగా కరణ్‌ జోహార్ పైనే కామెడీ చేసింది కంగన. ఈ విషయంలో కొందరు సైలెంట్ గా ఉంటే కొంతమంది మాత్రం పంచ్ లతో చంపేస్తున్నారు. ఒకవేళ నెపోటిజం నిజమైతే.. దీపికా పదుకొనె.. రనవీర్ సింగ్.. ప్రియాంక చోప్రా.. సిద్దార్ద్ మల్హోత్రా.. వీళ్ళందరూ ఎలా స్టార్లు అయ్యారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా సిద్దార్ధ్ మల్హోత్రా కూడా అదే కామెంట్ చేశాడు.

''నెపోటిజం ఉందా అని మీరు నన్ను అడగకూడదు. నేను ధియేటర్ చేశాను. అక్కడి నుండి క్యాస్టింగ్ కాల్స్ అటెండ్ అయ్యాను. నన్ను సెలక్ట్ చేశారు. ఇదంతా అందరికీ తెలిసిన నిజం. ఒకవేళ నెపోటిజం ఉంటే నేను ఎలా హీరో అవుతాను?'' అంటూ ప్రశ్నించాడు ఈ కుర్ర హీరో. కంగనా.. మరి నీ రియాక్షన్ ఏంటో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News