బాలీవుడ్ సంచలనం వివేక్ అగ్నిహోత్రి వ్యాక్సిన్ పై వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ నేపథ్యాన్నిఆధారంగా చేసుకుని మరో సంచలన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 'వ్యాక్సిన్ వార్' టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'కశ్మీర్ ఫైల్స్' తర్వాత వివేక్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంలో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.
కేవలం దర్శకుడి బ్రాండ్ తోనే ఓస్టార్ హీరో రేంజ్ లో సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఇటీవలే వ్యాక్సిన్ వార్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నటీనటులపై వివేక్ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇందులో నానా పటేకర్..అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్ నటులతో పాటు మరెంతో మంది ట్యాలెంటెడ్ నటులు నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో వివేక్ సతీమణి..నటి పల్లవి జోషి నటిస్తున్నారు.
తాజాగా సినిమాలో కొంత మంది సిక్కు వలంటీర్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా తెలిపారు. రియల్ లైఫ్ వలంటీర్లను కావాలనే సినిమాలో భాగం చేస్తున్నట్లు...వాళ్లు మాత్రమే పోషించే గలిగే పాత్రలు కావడంతో! ఆ బాధ్యతలు వాళ్లకే అప్పగించినట్లు చెబుతున్నారు. ఇలాంటి పాత్రల్ని సృష్టించడం కన్నా! వాస్తవ పాత్రలతోనే న్యాయం జరుగుతుంది భావించి రంగంలోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.
కోవిడ్ రెండవ దశలో వలంటీర్ల పాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. వైరస్ తో చనిపోవడంతో అంతిమ సంస్కాలరు నిర్వహించడానికి కుటుంబం సభ్యులే ముందుకు రాకపోవడంతో స్వచ్ఛందంగా కొంత మంది వలంటీర్లు ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు పూర్తిచేసారు.
అలా సేవ చేసిన వారు దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. అందులో సిక్కుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిక్కుల్నిసినిమాలో భాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసి స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.