సిల్లీగా భ‌లేగా కాపీ చేశారు!

Update: 2018-08-24 01:30 GMT
అల్ల‌రి న‌రేష్ - సునీల్ కాంబినేష‌న్‌ లో భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా సిల్లీఫెలోస్‌. సుడిగాడు చిత్రానికి ఇది సీక్వెల్ అని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ సినిమాలో పార్ట్ 1 త‌ర‌హాలో స్పూఫ్ కంటెంట్ ఉంటుందా? అంటే ఉండ‌ద‌నే యూనిట్ చెబుతోంది. సుడిగాడు బ్లాక్‌బ‌స్ట‌ర్ అయినా ఆ త‌ర‌హా స్ఫూఫ్ సినిమాలు ఇప్పుడు చూసే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి భీమ‌నేని అండ్ టీమ్ చాలానే జాగ్ర‌త్త ప‌డ్డారుట‌. త‌మిళంలో సుడిగాడు సీక్వెల్ తెర‌కెక్కి అక్క‌డ యావ‌రేజ్‌ గా ఆడింది. అదే సినిమాని తెలుగులో భీమ‌నేని రీమేక్ చేయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏడాది కాలంగా సెట్స్‌పై ఉన్నా.. ఈ సినిమా గురించి అస్స‌లు అప్‌డేట్స్ అన్న‌వే లేవు.

ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న రిలీజ‌వుతుంద‌ని టీమ్ ప్ర‌క‌టించింది. ఆ క్ర‌మంలోనే నేటి నుంచి ప్ర‌మోష‌న్‌ లో వేడి పెంచే ప్లాన్‌ లో ఉంది టీమ్‌. ఈరోజు సిల్లీ ఫెలోస్ మోష‌న్ టీజ‌ర్‌ని లాంచ్ చేసింది. అయితే ఈ టీజ‌ర్ ప‌ర‌మ‌రొటీన్ అంటూ జ‌నం పెద‌వి విరిచేశారు. అంతేనా.. ఈ మోష‌న్ టీజ‌ర్‌లో కాపీ ఛాయ‌లు క‌నిపించ‌డంతో దానిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అప్ప‌ట్లో మెగాస్టార్ చిరంజీవి- శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అంద‌రివాడు` చిత్రంలోని ఓ కామెడీ సీన్‌ని ఈ మోష‌న్ టీజ‌ర్ త‌ల‌పించింది. మామ‌ చిరంజీవిపై ప‌గ తీర్చుకోవాల‌నుకునే కోడ‌లు పిల్ల కుట్ర చేసి సునీల్‌ని బ‌రిలో దించుతుంది. ఆ క్ర‌మంలోనే సునీల్ చిరు వెంట‌ప‌డడం.. ఉన్న‌ట్టుండి చిరు బుల్లెట్టు గేర్ మార్చాక‌.. దాని వెన‌క‌ చిక్కుకున్న‌ సునీల్ వేలాడుతూ గాల్లో తేలిపోయే సీన్ క‌డుపుబ్బా న‌వ్వించింది. ఇప్పుడు అదే సీన్‌ ని కాపీ కొట్టి ఈ మోష‌న్ టీజ‌ర్‌ని సెట్ చేశారా? అన్న సందేహం క‌లిగింది. అయితే ఇది భీమ‌నేనికి యాధృచ్ఛికంగా వ‌చ్చినా ఐడియానా?  లేక ఇంకేదైనానా.. అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మొత్తానికి  సిల్లీ ఫెలోస్ విజ‌యం అటు న‌రేష్‌ - సునీల్‌, ఇటు భీమ‌నేని ముగ్గురికి ఎంతో ఇంపార్టెంట్. మునుప‌టిలా రొటీన్ కామెడీలు వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. డిగ్నిఫైడ్‌గా ఉంటూనే, లోతైన సంభాష‌ణ‌లు ఉంటేనే వ‌ర్క‌వుట‌వుతోంది. అంత డెప్త్‌ని భీమ‌నేని చూపిస్తున్నార‌నే భావిద్దాం.
Tags:    

Similar News