స్మాల్ స్క్రీన్ మీద రచ్చ చేయాలని చూస్తున్న సిల్వర్ స్క్రీన్ ఆంటీ...?

Update: 2020-05-24 07:36 GMT
సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లిగా అక్కగా అత్తగా నటించి అందర్నీ మెప్పించారు. తెలుగులో చాలా సినిమాల్లో సీనియర్ కమెడియన్స్ పక్కన జోడీగా నటించి కామెడీ పండించి అందరిని అలరించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు - తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ నటి ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గానూ పాపులర్ అయింది. తన భర్త సురేష్ తేజ డైరెక్ట్ చేసిన 'మా టాకీస్ 'హార్ట్ బీట్' 'మొగుడ్స్ పెళ్లామ్స్' వంటి టీవీ షోలలో యాకర్ గా చేశారు సురేఖా వాణి. ఆ సమయంలోనే సురేష్ తేజను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టించిన సురేఖావాణికి నెటిజన్లలో మంచి క్రేజ్ ఉంది. సమయం ఉన్నప్పుడల్లా తన కూతురుతో కలిసి డాన్స్ లు చేస్తూ ఇంస్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అలరిస్తూ ఉంటుంది. నాలుగు పదుల వయసు దాటిపోయినా.. పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా సురేఖా ఆంటీ జోరు మాత్రం తగ్గించడం లేదు. తన భర్త మరణించిన తర్వాత ఇంకొంచెం గ్లామర్ డోస్ పెంచి తన కూతురికి పోటీగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఈ వయసులో కూడా వయలుపోతూ ఉంటుంది. కూతురుతో పాటు ఆమె కూడా అందాలు ఆరబోయడానికి రెడీ అయిపోయి రచ్చ రచ్చ చేస్తుంటుంది. నా కూతురు కంటే నేనేమీ తక్కువ కాదని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా టిక్ టాక్ వీడియోలలో రెచ్చిపోతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన కూతురు సుప్రీతాతో కలిసి పంచె కట్టి ఆమె చేసిన రచ్చ తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖ వాణి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందట. ఇప్పటి దాకా సిల్వర్ స్క్రీన్ మీద హవా చూపించిన సురేఖ మళ్ళీ స్మాల్ స్క్రీన్ మీద కనిపించాలని ఆరాటపడుతోందట. దీనికి కారణం ఆమెకు ఈ మధ్య సినిమాల్లో మంచి సపోర్టింగ్ రోల్స్ రాకపోవడమే అని వెల్లడించిందట. ఇప్పటికే ఒక సీరియల్ లో నటించగా.. అది ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు సురేఖా ఆంటీ స్టేట్మెంట్ తో స్మాల్ స్క్రీన్ మీద ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడతాయేమో చూడాలి. అంతేకాకుండా తన కూతురు కోరుకుంటే ఆమెను కూడా సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పుకొచ్చిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఇన్ని రోజులు సినిమాల్లో అలరించిన సురేఖా వాణి ఇప్పుడు సీరియల్స్ లో నటించి అలరిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News