తమిళనాట దుమారం రేపుతున్న బీప్ సాంగ్ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ పాటను హీరో శింబు - మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కలిసి రూపొందించారని ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నారు. పైగా శింబు తండ్రి అయితే ఈ పాటతో తన కొడుక్కి ఏమాత్రం సంబంధం లేదని.. దాన్ని కంపోజ్ చేసింది అనిరుధ్ అని ఆరోపించాడు. కానీ ఇప్పుడు శింబు మీడియా ముందుకొచ్చి ఈ పాటకు అనిరుధ్ కు ఏమాత్రం సంబంధం లేదని తేల్చేశాడు. ఈ పాట రాసి కంపోజ్ చేసింది తనేనని.. కానీ ఎవరో దాన్ని దొంగిలించి నెట్ లో పెట్టేశారని శింబు వెల్లడించడం సంచలనం రేపుతోంది.
బీప్ సాంగ్ కు సంబంధించిన కేసులో చిక్కుకుని అజ్నాతంలోకి వెళ్లిపోయిన శింబు ఓ ప్రైవేటు ఛానల్ తో ఫోన్ లో మాట్లాడుతూ.. ఈ పాట తాను సొంతంగా రాసుకుని పాడుకున్నట్లు వెల్లడించాడు. ఐతే ఈ పాటను తాను బయట, మార్కెట్ లోకి విడుదల చేయలేదన్నాడు. తాను ఇంటిలో దాచుకున్న పాటను ఎవరో టెక్నాలజీ ఉపయోగించి బయటికి తీసి.. నెట్లో రిలీజ్ చేసేశారన్నాడు. సాధారణంగా ప్రేమ వ్యవహారంలో విఫలమైన వాళ్లు ఇలాంటి పాటలు పాడుకుంటారని.. తాను కూడా అలాంటి మూడ్ లోనే ఆ పాట రాసి పాడుకున్నానని శింబు చెప్పాడు. ప్రస్తుతం తమిళనాడు అంతటా ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి వ్యవహారంపై రాద్దాంతం చేయడం తగదని శింబు చెప్పాడు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. కాబట్టి ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని శింబు చెప్పాడు.