నిఖిల్ కోసం 'టైం ఇవ్వు పిల్లా' అంటోన్న శింబు..!

Update: 2022-11-26 10:34 GMT
డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ హీరోలలో సిలంబరసన్ శింబు ఒకరు. కోలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్న శింబు కు సంగీతం మీద కూడా మంచి పట్టు ఉంది. మ్యూజిక్ కంపోజర్ గా, లిరిసిస్ట్ గా, సింగర్ గా ఆయన మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. తెలుగులోనూ కొన్ని పాటలు పాడి శ్రోతలను అలరించాడు.

తెలుగులో తొలిసారిగా 'నేను మీకు తెలుసా' సినిమా కోసం 'మబ్బే మసకేసిందిలే' అనే సాంగ్ పాడిన శింబు.. ఆ తర్వాత 'పోటుగాడు' చిత్రంలో 'బుజ్జి పాప' పాట పాడారు. అలానే 'బాద్ షా' సినిమాలో 'డైమండ్ గర్ల్' సాంగ్ పడటంతో పాటుగా 'తిక్క' మూవీలో ఒక పాట ఆలపించారు. ఇటీవల 'ది వారియర్' మూవీలో 'బుల్లెట్‌' సాంగ్ తో ఉర్రుతలూగించారు.

ఈ క్రమంలో తమిళ స్టార్ ఇప్పుడు తెలుగులో మరో పాట పాడారు. “18 పేజెస్” చిత్రం కోసం 'టైం ఇవ్వు పిల్ల.. టైం ఇవ్వు' అనే సాంగ్ పాడినట్లుగా తెలుస్తోంది. సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వర సారధ్యంలో శింబు పాడిన ఈ గీతాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ - నేచురల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ''18 పేజెస్''. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ - టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే 'నన్నయ్య రాసిన' అనే ఫస్ట్ సింగిల్ కూడా అలరించింది. త్వరలో 'టైం ఇవ్వు పిల్లా' పాట కూడా విడుదల కానుంది. శింబు ఇప్పటి వరకూ తెలుగులో పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి. మరి '18 పేజెస్' సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్న '18 పేజెస్' చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. రమణ వంక ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.

నాస్టాల్జిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నగా తెరకెక్కుతున్న ''18 పేజెస్'' చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News