రామ్ గోపాల్ వర్మ చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్ జోరు పెరిగింది. ఈమధ్య ఏదో చడిచప్పుడు లేకుండా ఉన్నాడని జనాలు అనుకునేలోపు మళ్ళీ హుదుద్ తుఫానులా తెలుగు ప్రేక్షకుల మీదకు విరుచుకు పడుతున్నాడు వర్మ. తాజాగా ఈ సినిమా నుండి 'సింహగర్జన' అంటూ సాగే ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్.
ఈ పాట ఎన్టీఆర్ సీరియస్ గా ఫోన్ లో "క్షమించే సమస్యే లేదు.. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి" అంటూ గర్జించడం తో ప్రారంభం అవుతుంది. ట్యూన్ కొత్తగా అనిపించడం లేదు కానీ సాంగ్ మాత్రం ఫుల్ జోష్ లో సాగుతుంది. ఎన్టీఆర్ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం లాంటి సీన్లు ఉన్నాయి. ఒకవైపు ఎన్టీఆర్ ప్రచారం సాగుతూ ఉంటే మధ్యలో లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలు కొట్టడం లాంటి సన్నివేశాలను పాటలు పొందుపరిచారు. ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి మాత్రలు అందించడం.. నీళ్ళు అందించడం లాంటివి చేసినప్పుడు చంద్రబాబు పాత్రదారి అసహనం గా ఉండడం.. నెక్స్ట్ షాట్ లో నందమూరి కుటుంబ సభ్యులతో మంతనాలు సాగించడం లాంటివి ఉన్నాయి. లాస్ట్ లో ఎన్టీఆర్ పై చెప్పులు విసిరే సీన్ కూడా ఉంది.
ఓవరాల్ గా సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచే పాటే ఇది. సినిమాలో పవర్ఫుల్ డైలాగులే కాదు.. పవర్ఫుల్ గా ఉండే సాంగ్స్ కూడా ఉన్నాయని వర్మ ఒక శాంపిల్ చూపించినట్టుగా ఉంది. ఆలస్యం ఎందుకు.. అన్నగారి సింహగర్జనను తిలకించండి.
Full View