వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్. కథలు.. డైరెక్టర్ విషయంలో ఏ మాత్రం ప్రయోగాలకు వెనుకాడని హీరో. కానీ తన కెరీర్ లో కొత్త హీరోయిన్లతో చేసింది తక్కువే. ఆ మధ్య సూర్య vs సూర్యలో బెంగాలి హీరోయిన్ త్రిధా చౌదరిని ఇంట్రడ్యూస్ చేశాడు. తన నెక్ట్స్ మూవీలో ఒకేసారి ఇద్దరు హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు.
తన లేటెస్ట్ మూవీ కేశవ హిట్ తో మంచి ఊపుమీదున్న నిఖిల్ తర్వాత సినిమాగా కన్నడలో సూపర్ హిట్టయిన కిరాక్ పార్టీ రీమేక్ చేస్తున్నాడు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా కర్ణాటకకు చెందిన సంయుక్త హెగ్డేను తీసుకున్నారు. తాజాగా సెకండ్ హీరోయిన్ గా ఢిల్లీకి చెందిన సిమ్రన్ పరీంజాను ఎంపిక చేశారు. హిందీ టీవీ ఛానళ్లు స్టార్ ప్లస్ - జీటీవీలో వచ్చిన సీరియళ్ల తో బాగా పాపులర్ అయింది సిమ్రన్. కిరాక్ పార్టీ రీమేక్ తో తొలిసారి తెలుగు తెరలో అడుగు పెట్టబోతోంది. అందమైన ముఖం - ఆకట్టుకునే రూపం ఉన్న ఈ సిమ్రన్ కు లక్కు కలిసొస్తే అప్పటి సిమ్రన్ లా త్వరలోనే తెలుగులో ఫేమస్ అయిపోవచ్చు.
కిరాక్ పార్టీ సినిమాను కొత్త దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ చేస్తున్నాడు. నిఖిల్ తో స్వామి రారా - కేశవ సినిమాలు తీసిన సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అతడితో కార్తికేయ సినిమా తీసిన చందూ మొండేటి డైలాగ్ వెర్షన్ రాస్తున్నాడు.