పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కొన్నాళ్లకు.. మళ్లీ సినీ ఇండస్ట్రీమీద ప్రేమ పుట్టుకొచ్చేసి రీఎంట్రీ ఇవ్వడం హీరోయిన్లకు మామూలే. ఎవరో కొంతమంది వెండితెరకు దూరంగా ఉంటారు కానీ చాలామంది.. ఏదో ఓ పాత్రలకు సెటిల్ అయిపోయి కెరీర్ కంటిన్యూ చేసేస్తుంటారు. కానీ సిమ్రన్ లెక్క మాత్రం వేరేగా ఉంది. వయస్సు 40 ఏళ్లు టచ్ చేస్తున్నా కూడా... ఇంకా హీరోయిన్ గానే వెలిగిపోవాలని ఆశిస్తోంది.
అయితే.. ఈ వయసులో సిమ్రన్ ని హీరోయిన్ గా పెట్టి మూవీ తీసేందుకు ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం కష్టం. ఆవిషయం స్పష్టంగానే తెలుసు ఈ ముదురు భామకి. అందుకే తనే ఓ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసేసింది. రీసెంట్ గా ఓ త్రిష ఇల్లాన నయనతారలో చేసిన కేరక్టర్ కి మంచి స్పందన రావడంతో.. హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేయాలని నిర్ణయించేసుకుంది. తన సొంత బ్యానర్ లో భర్తనే ప్రొడ్యూసర్ గా చేసి ఓ పోలీస్ స్టోరీ చేసేస్తోంది. అన్నట్లు బుల్లితెరపై కూడా ఓ డ్యాన్స్ రియాల్టీ షోకి జడ్జ్ గా వ్యవహరించింది. అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
గ్లామర్ రోల్స్ తో కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను కట్టిపడేయాలని చూస్తోంది. హిందీలో రీసెంట్ గా వచ్చిన మర్దాని టైప్ లో ఓ మాంచి స్టోరీ లైన్ ని చెప్పాడట గౌరీశంకర్ అనే డైరెక్టర్. గతంలో కమర్షియల్ యాడ్స్ చేసిన ఇతగాడు... సిమ్రన్ రీఎంట్రీతో దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నవంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. దశాబ్దకాలంపాటు అగ్రహీరోలు అందరి పక్కన అందాలు ఒలకబోసే పాత్రలో చూసి.. ఇప్పుడు ఖాకీ దుస్తుల్లో కనిపించే కరుకైన సిమ్రన్ ని చూడాలంటే అభిమానులకు కష్టమే