ఇకనైనా ఈ బోల్డ్ బ్యూటీ బిజీ అవుతుందా..??

Update: 2021-04-14 11:30 GMT
ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికైనా వెనకడుగు వేయడం లేదు. కానీ సరైన అవకాశాలు మాత్రమే వారిని వరించడం లేదు. హీరోయిన్స్ అంటే అందంతో పాటు ఆకట్టుకునే అభినయం కూడా ఉండాలంటారు. కానీ ఎన్ని ఉన్నా అప్పుడప్పుడు కొందరు హీరోయిన్స్ విషయంలో ఇవేవి సహకరించలేవు. ఎందుకంటే ఈరోజుల్లో సినిమా ఇండస్ట్రీలో నెట్టుకురావాలంటే ఖచ్చితంగా హిట్టు కంపల్సరీ అయిపోయింది. కానీ ఫస్ట్ నుండి హిట్టు లేక ఇబ్బంది పడుతున్న కుర్రహీరోయిన్ సిమ్రత్ కౌర్. ఈ ముంబై బ్యూటీ ఇరవై యేళ్లకే హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇప్పటివరకు మూడు సినిమాలు చేసిన అమ్మడికి ఒక్కహిట్ కూడా పడలేదు.

'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన సిమ్రత్.. తర్వాత పరిచయం, డర్టీహరి అనే సినిమాలు చేసింది. ముఖ్యంగా డర్టీహరి సినిమాలో సిమ్రత్ గ్లామర్ షో మాములుగా ఉండదు. అడల్ట్ కంటెంట్ తో పాటు శృంగార సన్నివేశాలు, ఘాటు పెదవి ముద్దు సన్నివేశాలలో ఎలాంటి సంకోచం లేకుండా నటించింది. అలాగే ఓ వర్గం ప్రేక్షకులకు సిమ్రత్ ఫేవరేట్ కూడా అయిపోయింది. కానీ ఇంత బోల్డ్ హీరోయిన్ ఎందుకు విఫలం అయిందంటే.. స్టోరీ సెలక్షన్ లో అమ్మడు తడబడినట్లు అర్ధమవుతుంది. అలాగే ఈ బోల్డ్ బ్యూటీని చూసి మీడియం హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. కానీ యంగ్ హీరో ఆదిసాయికుమార్ పిలిచి మరీ తన కొత్తసినిమాలో అవకాశం ఇచ్చాడు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. చూడాలి మరి ఈ సినిమాతో అయినా అమ్మడు బిజీ హీరోయిన్ అవుతుందేమో!
Tags:    

Similar News