కళల యందు గానం - సంగీత కళలకు ఉన్న ప్రాముఖ్యత వేరు. సంగీతానికి సుస్వరానికి రాళ్లు అయినా కరుగుతాయి. హృదయాల్ని రంజింపజేసే అరుదైన కళ ఇది. ఇక కర్నాటిక్ సంగీతానికి గాయనీగాయకులకు ప్రపంచవ్యాప్తంగా వీర లెవల్లో ఫాలోయింగ్ ఉంది. ఈ విద్యలో మహిమాన్వితులైన ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో కర్నాటిక్ గాయని నాగరత్నమ్మ పేరు ఎంతో పాపులర్. నాగరత్నమ్మ స్త్రీ వాది. సామాజిక కర్త. స్వాతంత్య్ర సమరం కాలంలో క్లాసిక్ సింగర్ గానూ పాపులరయ్యారు. తనదైన గానంతోనే సమాజంలోని స్త్రీలలో చైతన్యం తెచ్చిన గొప్ప కళాకారిణి. అందుకే ఆమె జీవితకథలో బయోపిక్ కి సరిపడే ముడిసరుకు ఉందని భావించి సినిమా తీస్తున్నారు.
ప్రస్తుత బయోపిక్ ల ట్రెండ్ లో నాగరత్నమ్మ బయోపిక్ కి ప్రముఖ వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్టును సిద్ధం చేసిన ఆయన టైటిల్ పాత్రధారి... కాస్టింగ్ ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. పీపుల్స్ మీడియా సంస్థ ఈ బయోపిక్ ని నిర్మించనుందని తెలుస్తోంది. సింగీతంతో కలిసి బుర్రా సాయిమాధవ్ స్క్రిప్టు సహా డైలాగ్స్ పై వర్క్ చేస్తున్నారు. ఇంతకీ టైటిల్ పాత్రకు ఎవరిని ఎంపిక చేశారు? అంటే పలువురు కథానాయికల పేర్లు తొలిగా తెరపైకి వచ్చినా చివరిగా స్వీటీ అనుష్క శెట్టిని ఫైనల్ చేశారని తెలుస్తోంది.
అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో సౌత్ సహా ఇండియా లెవల్లో అత్యంత భారీగా రిలీజ్ చేయనున్నారట. 2020 ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మహానటి ఘనవిజయం సాధించిన తర్వాత వరుసగా ఎన్టీఆర్- వైయస్సార్ సహా పలువురు ప్రముఖులపై టాలీవుడ్ లో బయోపిక్ లు తెరకెక్కాయి. కానీ ఏదీ విజయం సాధించకపోవడం నిరాశపరిచింది. అయితే ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తూ తాజా బయోపిక్ తో సింగీతం హిట్టు కొడతారేమో చూడాలి. సింగర్ బయోపిక్ .. పైగా ఒక మేటి క్లాసిక్ గాయని బయోపిక్ ని కమర్షియల్ అంశాలతో రంజింపజేసేలా తెరకెక్కించడం అన్నది ఒక సవాల్ తో కూడుకున్నది. శంకరాభరణం లా స్లో పోయిజన్ లా ఎక్కించాలంటే పనవ్వని రోజులివి. నాలుగు రోజుల్లో సినిమాని థియేటర్లలోంచి తీసేస్తున్నారు. మరి ఇలాంటి టైమ్ లో ఈ సవాల్ ని సింగీతం అండ్ టీమ్ ఎంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారో చూడాలి.